Friendship Marriage: ఏమిటీ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్? జపాన్‌లో యువతీయువకుల కొత్త డేటింగ్ గురించి తెలుసా?
ABN , Publish Date - May 11 , 2024 | 10:52 AM
వివాహం అంటే ఇద్దరు మనుషుల కలయిక, రెండు మనసులు కలయిక, రెండు శరీరాల కలయిక. అయితే రాన్రానూ వివాహ వ్యవస్థ కాలంతో పాటు మారుతూ వస్తోంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది అలాంటి మార్పుల్లో ఒకటి. ఇందులో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ భార్యాభర్తలుగా జీవించవచ్చు.
వివాహం (Marriage) అంటే ఇద్దరు మనుషుల కలయిక, రెండు మనసులు కలయిక, రెండు శరీరాల కలయిక. అయితే రాన్రానూ వివాహ వ్యవస్థ కాలంతో పాటు మారుతూ వస్తోంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది అలాంటి మార్పుల్లో ఒకటి. ఇందులో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ భార్యాభర్తలుగా జీవించవచ్చు. శారీరకంగా, మానసికంగా ఒకరి మీద మరకొరు ఆధారపడవచ్చు. అయితే జపాన్ (Japan)లో ప్రస్తుతం మొదలైన ట్రెండ్ ప్రకారం అయితే ఆ నియమం కూడా లేదు. ఆ వివాహ వ్యవస్థకు వాళ్లు పెట్టుకున్న పేరు.. ``ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్`` (Friendship Marriage).
జపాన్‌లో ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ వివాహం వైపు చాలా మంది జపాన్ యువతీ యువకులు ఆకర్షితులవుతున్నారు. ఈ వివాహంలో ప్రేమ ఉండదు, శారీరక కలయిక ఉండదు. ఇద్దరు స్నేహితులు ఒకే ఇంట్లో కలిసి ఉంటే ఎలా ఉంటుందో.. ఇందులోనూ అలాగే ఉంటుంది. కేవలం స్నేహం మాత్రమే ఉంటుంది. వారు కోరుకుంటే కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కూడా పొందవచ్చు. అలాగే ఈ వివాహంలోని ఇద్దరు భాగస్వాములు వేరే వాళ్లతో రిలేషన్ షిప్ పెట్టుకునేందుకు కూడా స్వేచ్ఛ ఉంటుంది.
మొత్తానికి ఈ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్ అంటే కేవలం ఓ రూమ్మేట్‌ను ఎంచుకోవడం లాంటిది మాత్రమే. ఆ ఇంటి నిర్వహణకు సంబంధించినంత వరకు మాత్రమే వారు భాగస్వాములు. మిగతా ఏ విషయంలోనూ ఒకరి స్వేచ్ఛను మరొకరు అడ్డుకునే వీలుండదు. పెళ్లయిన తర్వాత కూడా స్వేచ్ఛగా ఉండాలనుకునే వారు ఈ వివాహానికి ప్రాధాన్యత ఇస్తున్నారట. జపాన్‌లో వృద్ధుల జనాభా పెరిగిపోతోందని, పిల్లలను కనాలని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుంటే, అక్కడి యువతీ యువకులు మాత్రం ఇలాంటి వివాహాల వైపు అకర్షితులవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో సుత్తి ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి!
Viral Video: ఛీ.. ఛీ.. పిచ్చి ముదిరితేనే ఇలా తింటారు.. ఉల్లిపాయను కాఫీలో ముంచి తింటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..