ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కుర్రకారు జోరు... నెటిజన్ల పోరు.. స్పందించిన ఖాకీలు

ABN, Publish Date - Jul 03 , 2024 | 05:56 PM

బిహార్‌లోని వైశాలీ జిల్లాలో కుర్రకారు.. బైక్‌పై రాజమౌళి సినిమాలో ఈగలాగా దూసుకుపోతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. గేమ్స్ ఆఫ్ ఢిల్లీ.. ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

బిహార్‌లోని వైశాలీ జిల్లాలో కుర్రకారు.. బైక్‌పై రాజమౌళి సినిమాలో ఈగలాగా దూసుకుపోతున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. గేమ్స్ ఆఫ్ ఢిల్లీ.. ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. ఆ క్రమంలో బిహార్ పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. వీరి వివరాలను అందజేయాలని నెటిజన్లకు సూచించారు. అలాగే వీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విన్యాసాలు చేశారో కూడా తమకు తెలియజేయాలన్నారు. మరోవైపు బైక్‌పై విన్యాసాలు చేస్తున్న ఓ వ్యక్తి బైక్ నెంబర్‌ను ఈ సందర్బంగా ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Also Read: Hathras stampede: ఎఫ్ఐఆర్‌లో లేని ‘బోలే బాబా’.. కోవిడ్‌లో సైతం సత్సంగం


ఇక నిత్యం రద్దీగా ఉండే రహదారులపై బైక్‌లతో వారు ఇలా జిగ్ జాగ్ విన్యాసాలతో స్థానికులనే కాదు.. ఎదురుగా వస్తున్న వాహనదారులను సైతం టెన్షన్ పెడుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా విన్యాసాల వల్ల బైక్‌ నడిపే వారికే కాదు.. ఎదురుగా వస్తున్న వాహనదారుల ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇంత నిర్లక్ష్యంగా వాహనాలను ఎలా నడుపుతారంటూ.. బైక్ నడుపుతున్న కుర్రకారుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read: Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..


ఇంకోవైపు ఇటీవల మహారాష్ట్ర పుణెలో ఓ యువతి బైక్‌పై ఇదే తరహాలో వ్యవహరించిన ఘటనను ఈ సందర్బంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. యమహా ఆర్ఎక్స్ 100 బైక్‌పై పక్కకు కూర్చొన్న యువతి.. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సినిమాలోని సాంగ్ వింటూ వెళ్తున్న వీడియోలోను వారు వివరిస్తున్నారు. ఆ క్రమంలో ఆ యువతి చేసిన విన్యాసాలపై నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే.

Also Read: Hathras Event: లైంగిక వేధింపుల కేసుల్లో ‘బోలే బాబా’..!

Read Latest National News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 06:10 PM

Advertising
Advertising