Viral: వావ్.. మన సీతాకోకచిలుక హీరోయిన్ తెలివి అమోఘం.. ఒక్క చుక్క నూనె చిందకుండా ప్యాకెట్ నుండి నూనెను ఎలా పోసారో చూడండి..!
ABN, Publish Date - Jul 17 , 2024 | 10:49 AM
వంటింట్లో నూనె ప్యాకెట్ కట్ చేయడం, నూనె చిందకుండా, ఒక్క చుక్క కూడా కింద పడకుండా కంటైనర్లలో నింపడం కాస్త పనితో కూడుకున్నదే. ఎంత జాగ్రత్తగా పోసినా నూనె ఒలికిపోతూ ఉంటుంది. కానీ..
వంటింట్లో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల పని సులువు అవుతుంది. టైమ్ కూడా సేవ్ అవుతుంది. అలాంటి టిప్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వంటింట్లో నూనె ప్యాకెట్ కట్ చేయడం, నూనె చిందకుండా, ఒక్క చుక్క కూడా కింద పడకుండా కంటైనర్లలో నింపడం కాస్త పనితో కూడుకున్నదే. ఎంత జాగ్రత్తగా పోసినా నూనె కింద పడటం లేదా కంటైనర్ల అంచుల నుండి కిందకు కారడం జరుగుతుంది. ఈ కారణంగా కంటైనర్లు పట్టుకున్నప్పుడు చేతులకు నూనె అంటుకుంటుంది. ఇలాంటి తిప్పలు లేకుండా ఎంచక్కా నూనెను నేరుగా కంటైనర్ లో ఈజీగా పోయడానికి అధిరిపోయే చిట్కాకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీగా తెలుసుకుంటే..
పాదాలు, మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..!
సీతాకోకచిలుక(Seethakoka Chilaka) సినిమా పేరు తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ముచ్చెర్ల అరుణ(muccherla aruna) హీరోయిన్ గా చేశారు. వివాహం అనంతరం ఈమె చాలా గ్యాప్ తరువాత తాజాగా సోషల్ మీడియాలో తళుక్కుమంటున్నారు. ఈమె పలురకాల కిచెన్ టిప్స్, వంటలు, లైఫ్ హ్యాక్స్ పరిచయం చేస్తుంటారు. అందులో భాగంగానే ప్యాకెట్ లో నూనెను ఒక్క చుక్క కూడా చిందకుండా కంటైనర్ లో ఎలా పోయాలో చూపించారు.
ప్రపంచంలో అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగిన జంతువులు ఇవే..!
నూనె ప్యాకెట్(oil packet) ను కట్ చేశాక కంటైనర్ లో పోసే ముందు ఒక గరిటెను కంటైనర్ లో తలకిందులుగా ఉంచారు. నూనెను గరిటలో పోస్తుంటే నూనె ఎంచక్కా పక్కకు చిందకుండా, కంటైనర్ అంచులకు అంటుకోకుండా కంటైనర్ లోకి వెళుతుంది. ఈ చిట్కాను పరిచయం చేస్తూ ముచ్చెర్ల అరుణ గారు 'నేను చాలా కూల్ హ్యాక్ ను కనుగొన్నాను, అది నాకు పనిచేసింది' అని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ mucherla.aruna నుండి షేర్ చేశారు. ఈ చిట్కా చూసిన పలువురు చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. చిట్కా చెప్పడం కంటే ముచ్చెర్ల అరుణ గారు చాలా యాక్టీవ్ గా ఉండటం అందరిని ఆకట్టుకుంటోంది. మరికొందరు ఈ టిప్ ను తాము ఫాలో కాబోతున్నామని చెప్పుకొచ్చారు.
వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!
శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 17 , 2024 | 10:49 AM