Viral: ఇదో శుభలగ్నం కేసు.. ప్రియుడి భార్యపై కోర్టుకెక్కిన మహిళ.. కారణం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 20 , 2024 | 04:41 PM
జగపతి బాబు, ఆమని, రోజా నటించిన సూపర్ హిట్ చిత్రం ``శుభలగ్నం`` చూశారా? ఆ సినిమాలో ఆమనికి కోటి రూపాయలు ఇచ్చి జగపతి బాబును రోజా కొనుక్కుంటుంది. పెళ్లి చేసుకుని అతడితో కాపురం కూడా చేస్తుంది. అచ్చం అలాంటి కథే చైనాలో కూడా వాస్తవంగా జరిగింది. అయితే చిన్న ట్విస్ట్ కారణంగా ఆ కేసు కోర్టుకెక్కింది.
జగపతి బాబు, ఆమని, రోజా నటించిన సూపర్ హిట్ చిత్రం ``శుభలగ్నం`` చూశారా? ఆ సినిమాలో ఆమనికి కోటి రూపాయలు ఇచ్చి జగపతి బాబును రోజా కొనుక్కుంటుంది. పెళ్లి చేసుకుని అతడితో కాపురం కూడా చేస్తుంది. అచ్చం అలాంటి కథే చైనా (China)లో కూడా వాస్తవంగా జరిగింది. అయితే చిన్న ట్విస్ట్ కారణంగా ఆ కేసు కోర్టుకెక్కింది. ప్రస్తుతం ఆ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విచిత్రమైన విడాకుల కథ చర్చనీయాంశంగా మారింది (Viral News).
చైనాకు చెందిన హోన్షి అనే మహిళ హాన్ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే అప్పటికే హాన్‌కు పెళ్లైంది. యాంగ్ అనే మహిళను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు. అయినా హోన్షితో ప్రేమాయణం సాగించి ఆమెతో ఓ కొడుకును కన్నాడు. తన ప్రియుడితో బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని హోన్షి నిర్ణయించుకుంది. దీంతో యాంగ్‌తో డీల్ మాట్లాడుకుంది. హాన్‌కు విడాకులు ఇస్తే 1.2 మిలియన్ యువాన్లు (రూ.1.39 కోట్లు) ఇస్తానని యాంగ్‌కు ఆశ పెట్టింది. అందుకు యాంగ్ అంగీకరించింది. హోన్షి నుంచి మొత్తం డబ్బులు తీసుకుంది. అయితే డబ్బులు తీసుకున్నాక యాంగ్ ప్లేట్ ఫిరాయించింది. తనను మోసం చేసిన భర్త, అమె ప్రియురాలికి బుద్ధి చెప్పాలనుకుంది. విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో చేసేది లేక హోన్షి కోర్టును ఆశ్రయించింది.
యాంగ్ చేసిన మోసంపై ఫిర్యాదు చేసింది. తనకు యాంగ్ నుంచి తిరిగి ఇప్పించమని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు హోన్షికి షాకిచ్చింది. వారిద్దరూ చట్టప్రకారం విడాకులు తీసుకోలేదు కనుక భార్యాభార్తలే అని తేల్చి చెప్పింది. అంతేకాదు.. నైతిక విలువలు లేకుండా వేరొకరి భర్తతో కొడుకును కనడం తప్పని, పైగా విడాకులు తీసుకోమని బలవంతం చేయడం చట్ట ప్రకారం నేరం అని వ్యాఖ్యానించింది. అయితే తన భర్త, సవతి హోన్షి పెడుతున్న పోరును భరించలేక చట్టబద్ధంగా విడిపోవడానికి యాంగ్ ముందుకు వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే విడిపోనున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: రీల్స్ కోసం ఇలా చేయడం తప్పు.. ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు ఎందుకంటే..
Optical Illusion Test: మీవి నిజంగా డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో గ్లౌస్, చేప ఎక్కడున్నాయో కనుక్కోండి..
Viral Video: హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న కోతికి షాకింగ్ అనుభవం.. హఠాత్తుగా మొసలి నోటికి చిక్కి..
IQ Test: మీ తెలివికి సవాల్.. ఆ ఇద్దరిలో అబద్ధం ఎవరు చెబుతున్నారో కనుక్కోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి