Share News

Viral Video: రీల్స్ కోసం ఇలా చేయడం తప్పు.. ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు ఎందుకంటే..

ABN , Publish Date - Dec 20 , 2024 | 03:50 PM

తాజాగా ముంబైకు చెందిన ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక కుక్క ఆటోరిక్షా టాప్‌పై నిల్చుని ప్రయాణిస్తోంది. జుహులో ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.

Viral Video: రీల్స్ కోసం ఇలా చేయడం తప్పు.. ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు ఎందుకంటే..
Dog on Auto roof top

సోషల్ మీడియా రీల్స్ కోసం ఎవరెవరు ఏం చేస్తున్నారో ఊహించడం కష్టంగా మారింది. ఇతరులను ఆకట్టుకునేందుకు చాలా మంది వింతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ముంబై (Mumbai)కు చెందిన ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక కుక్క (Dog) ఆటోరిక్షా టాప్‌పై (Auto) నిల్చుని ప్రయాణిస్తోంది. జుహులో ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


streetdogsofbombay అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్నఆ వీడియో ప్రకారం.. ఒక పోమెరేనియన్ కుక్కను టాప్ మీద నిల్చోబెట్టి ఓ వ్యక్తి ఆటోను నడుపుతున్నాడు. ఒక్కసారి కాదు.. తరచుగా అదే పని చేస్తున్నాడు. ఆ వీడియోలో రెండు క్లిప్‌లు ఉన్నాయి. ఒకటి పగటిపూట చిత్రీకరించినది.. మరొకటి రాత్రిపూట చిత్రీకరించనది. ఆటో వేగంగా వెళ్తోంటే ఆ కుక్క టాప్‌పై బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడి ఉంది. ట్రాఫిక్‌లో కూడా ఆ వ్యక్తి కుక్కను అలా నిల్చోబెట్టే ఆటో నడుపుతున్నాడు. అలా చేయడం ఆ కుక్క, ఇతరుల భద్రత దృష్ట్యా హానికరమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఆ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ చర్య చాలా అసహ్యకరమైనది``, ``పెంపుడు జంతువులు వస్తువులు లేదా అలంకరణలు కావు. అవి కూడా మనలాగే భయం, బాధను అనుభవిస్తాయి``, ``ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీవి నిజంగా డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో గ్లౌస్, చేప ఎక్కడున్నాయో కనుక్కోండి..


Viral Video: హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న కోతికి షాకింగ్ అనుభవం.. హఠాత్తుగా మొసలి నోటికి చిక్కి..


IQ Test: మీ తెలివికి సవాల్.. ఆ ఇద్దరిలో అబద్ధం ఎవరు చెబుతున్నారో కనుక్కోండి..


Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే.. 19 ఏళ్ల బాలుడిని గ్రైండర్‌ ఏం చేసిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 20 , 2024 | 03:50 PM