ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Wings to Wagon R Car: ‘కారు’కు రెక్కలొచ్చాయ్.. అది చూసిన పోలీసులు ఏం చేశారంటే..

ABN, Publish Date - Mar 19 , 2024 | 02:13 PM

Viral News: కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. ధిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడని అంటారు. మన దేశంలో ట్యాలెంట్‌(Talent)కు కొదవే లేదు. గ్రామీణ ప్రాంతాల్లో(Villages) ఉంటూ వెలుగులోకి రాని మట్టిలో మాణిక్యాలు కోకొల్లలుగా ఉన్నారు. అయితే, నేటి సోషల్ మీడియా(Social Media) యుగంలో..

Wings to Car

Viral News: కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. ధిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడని అంటారు. మన దేశంలో ట్యాలెంట్‌(Talent)కు కొదవే లేదు. గ్రామీణ ప్రాంతాల్లో(Villages) ఉంటూ వెలుగులోకి రాని మట్టిలో మాణిక్యాలు కోకొల్లలుగా ఉన్నారు. అయితే, నేటి సోషల్ మీడియా(Social Media) యుగంలో.. పరిస్థితి కాస్త మారింది. ఏ మూలన ఏం జరిగినా ఇట్టే యావత్ ప్రపంచానికి చేరిపోతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరుడు తమ ఆలోచనతో.. కారును విమానంగా మార్చేశారు. మారుతి వ్యాగన్ ఆర్ కారును హెలికాప్టర్‌గా మోడిఫై చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్‌గ్రేడ్ అనే పదానికి సరికొత్త అర్థం చెబుతూ.. ఈ సోదరులిద్దరూ కొత్త ప్రయోగాన్ని చేశారు. అయితే, వీరి ప్రయోగం అటు తిరిగి.. ఇటు తిరిగి పోలీసు కంట పడింది. దాంతో వారొచ్చి ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన యూపీలోని అంబేద్కర్ నగర్‌లో చోటు చేసుకుంది.

అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇద్దరు సోదరులు.. కొత్తగా ఆలోచించి తమ వద్దనున్న వ్యాగన్ ఆర్ కారును హెలికాప్టర్‌గా మార్చేశారు. కారుకు పైన ఫ్యాన్, వెనుక తోక మాదిరిగా(Tail Rotor)ను ఏర్పాటు చేశారు. భూమిపై నడిచే హెలికాప్టర్‌గా దీనిని తీర్చిదిద్దారు. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా.. అదికాస్తా పోలీసుల కంట పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ కారు ఉందంటూ దానిని సీజ్ చేశారు పోలీసులు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 02:13 PM

Advertising
Advertising