ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: పాపం.. ఈ కుక్కకు చావు ముంచుకొస్తున్న విషయమే తెలీలా! షాకింగ్ వీడియో

ABN, Publish Date - May 04 , 2024 | 04:13 PM

చడీచప్పుడు లేకుండా ఓ చిరుత కుక్కను మట్టుపెట్టిన తీరు జనాలను షాక్‌కు గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: పిల్లి, పులి, సింహం, చిరుత.. ఇవన్నీ వేటాడటంలో ఆరి తేరిన జంతువులు. ఇవి మాటువేటి వేటకు దిగితే తప్పించుకునే జంతువే ఉండదు. ఇందుకు సంబంధించి మరో షాకింగ్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది. వీడియో కాస్తంత పాతదే అయినా మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇది చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. వేటాడటంలో పిల్లిజాతికి చెందిన జంతువులకు సాటి రాగల జీవి మరొకటి లేదని చెబుతున్నారు.

జైపూర్‌లోని ఝలానాలో ఈ ఘటన జరిగింది. ఓ కుక్క వెళుతుండటాన్ని అక్కడే ఉన్న ఓ చిరుత గమనించింది. దాన్ని చూడగానే చిరుత అలర్టైపోయింది. పొదల మాటున అస్సలు శబ్దం చేయకుండా, కుక్క కంట పడకుండా జాగ్రత్తపడింది. ఇన్ని వ్యూహాలు తెలీని కుక్క తన దారిన తాను కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి ఎందుకో నిలబడింది. మృత్యువు కన్ను దానిపై పడిందన్న విషయం గ్రహించనే లేదు (Video Of Leopard Killing Dog Goes Viral).

Viral: వీరిది నిజంగానే జన్మజన్మల బంధం.. నమ్మశక్యం కాని లవ్ స్టోరీ!


కుక్క ఏమరపాటుగా ఉన్న సమయాన్ని సరిగ్గా అంచనా వేసిన చిరుతు ముందుకురికింది. చప్పుడు చేయకుండా వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా కుక్కపై దూకి మెడ పట్టుకుంది. కాసేపు గిలగిల్లాడిన కుక్క చివరకు ప్రాణాలు విడిచింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది.

ఈ షాకింగ్ వీడియో చూసి జనాలు నోరెళ్ల బెడుతున్నారు. చిరుత, పులి, పిల్లి, సింహం వంటివి అసలైన ప్రమాదకారులని కామెంట్ చేస్తున్నారు. చిరుత చప్పుడు చేయకుండా వచ్చి మట్టుపెట్టిన తీరుకు అనేక మంది షాకైపోయారు. వేటాడేందుకు అనువుగా వాటి శరీర నిర్మాణం ఉంటుందని కొందరు చెప్పారు.

Read Viral and Telugu News

Updated Date - May 04 , 2024 | 04:41 PM

Advertising
Advertising