Viral Video: బాబోయ్.. బాత్రూమ్ లో వేసుకునే చెప్పులకు ఇంత ధర?.. ఓ కువైట్ షాపుపై విరుచుకుపడుతున్న భారతీయ నెటిజన్లు.. !
ABN, Publish Date - Jul 17 , 2024 | 08:05 AM
చెప్పులు సాధారణంగా క్యాజువల్ వేర్, పార్టీ వేర్ అంటూ రకరకాలుగా ఉంటాయి. ఇక చాలామంది ఇంట్లో బాత్రూమ్ కు వెళ్లి రావడానికి కూడా ఒక జత సాధారణ చెప్పులు ఉంటాయి. వీటి ధర మహా అయితే రూ.100 లోపే ఉంటుంది.
ఇంటి నుండి బయటకు అడుగు పెట్టామంటే ఖచ్చితంగా కాళ్లకు చెప్పులు ఉండాల్సిందే. చెప్పులు సాధారణంగా క్యాజువల్ వేర్, పార్టీ వేర్ అంటూ రకరకాలుగా ఉంటాయి. ఇక చాలామంది ఇంట్లో బాత్రూమ్ కు వెళ్లి రావడానికి కూడా ఒక జత సాధారణ చెప్పులు ఉంటాయి. వీటి ధర మహా అయితే రూ.100 లోపే ఉంటుంది. అయితే ఎడారి దేశం కువైట్ లో ఒక షాపులో ఈ చెప్పుల ధర నెటిజన్లు షాక్ కు గురిచేస్తోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
చెప్పుల ధరలు(Footwear Price) బ్రాండ్ ను బట్టి, క్వాలిటీని బట్టి, మోడల్ ను బట్టి వివిధ రకాలుగా ఉంటాయి. మంచి ఫ్యాషన్ చెప్పులు అయితే లక్షలలో ఉండటం సాధారణమే.. వీటిని సెలబ్రిటీలు, ధనవంతులు కొనుగోలు చేయగలరు. కానీ కువైట్(Kuwait) లో ఒక షాపులో చెప్పుల ధర వైరల్ గా మారింది. చెప్పుల ధర అనడం కంటే ఆ చెప్పులే ఇలా చర్చకు కారణం అవుతున్నాయి. ఈ చెప్పులేమీ ఫ్యాషన్ వి కాదు.. అలాగని మంచి బ్రాండ్ కూడా కాదు. సాధారణంగా భారతీయుల ఇళ్లలో బాత్రూమ్(Indian bathroom slippers) కు వెళ్లడానికి ఉపయోగించే పారగాన్ చెప్పుల లాగే ఇవి ఉన్నాయి. వీటి ధరను 4500 రియాల్స్(4500 rials) గా ఉంచారు. ఇది భారతీయ కరెన్సీలో 1లక్ష రూపాయలకు సమానం.
ప్రపంచంలో అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగిన జంతువులు ఇవే..!
దీనికి సంబంధించి ట్విట్టర్(Twitter) లో ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చెప్పులను గాజు ర్యాక్స్ లో ప్రదర్శనగా ఉంచారు. ఒక వ్యక్తి చెప్పులను బయటకు తీసి చెప్పుల క్వాలిటీని పరీక్షించి చూపించడం కనిపిస్తుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం ఈ చెప్పుల ధర చూసి షాకవుతున్నారు. 'ఇవి బాత్రూమ్ కు వెళ్లినప్పుడు వేసుకునే చెప్పుల్లానే ఉన్నాయి, వీటికి ఇంత ధర ఎందుకో' అని ఒకరు కామెంట్ ఛేశారు. 'బహుశా ఇవి ధనవంతులకు విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు' అని ఇంకొకరు అన్నారు. 'మేము బాత్రూమ్ కు వెళ్లడానికి రోజూ రూ.1లక్ష విలువ చేసే చెప్పులు ఉపయోగిస్తున్నాం అన్నమాట' అని మరొకరు అన్నారు. 'ఈ చెప్పులు భారత్ లో కేవలం రూ.60లో దొరుకుతాయి' అని చెప్పుల ధర చెప్పుకొచ్చారు మరొక వ్యక్తి.
వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..!
శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 17 , 2024 | 08:12 AM