ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: బైక్ నడుపుతూ ఏకంగా పొలాన్ని దున్నేయచ్చా? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

ABN, Publish Date - May 28 , 2024 | 04:36 PM

భారతదేశంలో పొలాలను దున్నడానికి సాధారణంగా ఎడ్లను ఉపయోగిస్తారు. కొందరు అయితే ట్రాక్టర్లను కూడా ఉపయోగిస్తారు. కానీ బైక్ తో పొలాన్ని దున్నేయచ్చని ఎప్పుడైనా ఆలోచించారా?

బైక్ లు సాధారణంగా ప్రయాణం చెయ్యడానికి, అవసరమైన వస్తువులు తీసుకురావడానికి ఉపయోగిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం బైక్ నడుపుతూ ఏకంగా పొలాన్ని దున్నేలా బైక్ ను మార్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంప్రెస్ అవుతున్నారు. ఇది రైతులకు చాలా సహాయపడుతుందని కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో పొలాలను దున్నడానికి సాధారణంగా ఎడ్లను ఉపయోగిస్తారు. కొందరు అయితే ట్రాక్టర్లను కూడా ఉపయోగిస్తారు. కానీ బైక్ తో పొలాన్ని దున్నేయచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియో చూస్తే అది సాధ్యమే అని అర్థమవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి బైక్ మీద కూర్చుని ఉన్నాడు. అతను కూర్చొన్న బైక్ కు వెనుక వైపు పొలం దున్నడానికి ఉపయోగించే పనిముట్టును అమర్చారు. దాని మీద పెద్ద రాయి ఉంచారు. ఈ పనిముట్టుకు పొడవునా హ్యాండిల్ ఏర్పాటు చేశారు. ఎడమవైపు ఉన్న హ్యాండిల్ ను ఆపరేట్ చేసి పనిముట్టును భూమిలోకి దించుతాడు. ఆ తరువాత బైక్ ను స్టార్ట్ చేస్తే అది భూమిని దున్నుతూ వెళ్తుంది.

ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!


ఈ వీడియోను mia_farms అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు పలువిధాలుగా కామంట్ చేస్తున్నారు. 'బైక్ లు ఇలా ఉపయోగించడానికి తయారు చేయలేదు' అని ఒకరు అన్నారు. 'పొలాల్లో బైక్ నడవదు, టైర్ జారిపోతుంది' అని ఇంకొకరు అన్నారు. 'ఇది రైతులకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది' అని మరొకరు అన్నారు.

మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..

ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 28 , 2024 | 05:00 PM

Advertising
Advertising