ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఇంత ధైర్యం ఏంటయ్యా బాబూ.. బుసలు కొడుతున్న భారీ కొండచిలువను ఎలా పట్టుకున్నాడో చూడండి..!

ABN, Publish Date - May 23 , 2024 | 04:58 PM

పాము పేరు వినబడితేనే చటుక్కున దాక్కునేవాళ్లు, చుట్టూ చూసుకుని జాగ్రత్తపడేవాళ్లే ఎక్కువమంది ఉంటారు. అలాంటిది బారీ కొండ చిలువను చూస్తే దైర్యంగా దానిముందు నిలబడేవారు ఎవరు? కానీ కొందరు మాత్రం ఇలాంటి వాటికి ఎదురు నిలబడతారు.

పాము పేరు వినబడితేనే చటుక్కున దాక్కునేవాళ్లు, చుట్టూ చూసుకుని జాగ్రత్తపడేవాళ్లే ఎక్కువమంది ఉంటారు. అలాంటిది బారీ కొండ చిలువను చూస్తే దైర్యంగా దానిముందు నిలబడేవారు ఎవరు? కానీ కొందరు మాత్రం ఇలాంటి వాటికి ఎదురు నిలబడతారు. నువ్వా.. మేమా అన్నట్టు సవాల్ విసురుతారు. ఇతనూ అలాంటి కోవకు చెందినవాడే..బుసలు కొడుతున్న భారీ కొండచిలువను ఎంత దైర్యంగా పట్టుకున్నాడో చూస్తే గుండెలు దడదడలాడటం ఖాయం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తే.. మరికొన్ని భయం పుట్టించేలా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో రెండవ కోవకు చెందినది. ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయబడిన వీడియోలో ఓ వ్యక్తి భారీ కొండచిలువను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే కొండచిలువ అతని చేతికి చిక్కడం లేదు. పైపెచ్చు అది బుసలు కొడుతూ అతని మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ అతను మాత్రం కొండచిలువను వదల్లేదు. ధైర్యంగా కొండచిలువను ఒడిసి పట్టి చివరకు దాని తలను తన చేత్తో బంధించాడు.

ఐరన్ లెవల్స్ ను అమాంతం పెంచే పానీయాలు ఇవీ..!


therealtarzann అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేరే చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. కొండచిలువ భారీ పరిమాణం, అది కదులుతున్న తీరులో దాని కోపం స్పష్టంగా అర్థమవుతున్నాయి. 'అతను నిజమైన టార్జాన్' అని ఒకరు కామెంట్ చేశారు. 'వీడియోను స్లో మోషన్ లో రూపొందించండి' అని మరొకరు కామెంట్ చేశారు. 'దయచేసి ఆ పామును వదిలేయండి' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!

ఐరన్ లెవల్స్ ను అమాంతం పెంచే పానీయాలు ఇవీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 23 , 2024 | 04:58 PM

Advertising
Advertising