ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Watch Video: పూజ గదిలోకి గాయపడిన కోతి.. భక్తురాలిని హత్తుకుని ఏం చేసిందంటే..

ABN, Publish Date - Jan 21 , 2024 | 06:40 PM

Monkey Hugs Devotee: శివాలయంలోకి పాము వచ్చి శివలింగాన్ని చుట్టుకోవడం.. మూగ జీవాలు ఆలయంలోకి వచ్చి ప్రదక్షిణలు చేయడం, దేవుళ్లను పూజించడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇందుకు సంబంధించి అరుదైన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Monkey Hugs Devotee in Pooja Mandir

Monkey Hugs Devotee: శివాలయంలోకి పాము వచ్చి శివలింగాన్ని చుట్టుకోవడం.. మూగ జీవాలు ఆలయంలోకి వచ్చి ప్రదక్షిణలు చేయడం, దేవుళ్లను పూజించడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇందుకు సంబంధించి అరుదైన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇలాంటి సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ఒక్కరోజు ముందు ఈ వీడియో నెట్టింట్లో భక్తుల మనసులను కొల్లగొడుతోంది. గాయంతో బాధపడుతున్న ఓ కోతి.. పూజ గదిలోకి వచ్చి, పూజ చేస్తున్న భక్తురాలిని తన రెండు చేతులతో హత్తుకుంది. హృదయాన్ని ద్రవింపజేస్తున్న ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో ఓసారి తెలుసుకుందాం..

పూజ గదిలో ఓ మహిళా భక్తురాలు శ్రీరాముడిని పూజిస్తోంది. ఇంతలో కాలికి గాయంతో బాధపడుతున్న ఓ కోతి పూజ గదిలోకి వచ్చింది. ఒంటి కాలితో కుంటుకుంటూ వచ్చిన ఆ కోతి.. దేవుళ్లకు పూజ చేస్తున్న భక్తురాలి వద్దకు వచ్చి ధీనంగా కూర్చుంది. ఆ తరువాత భక్తురాలి ఒడిలో కూర్చుంది. ఆమె ముఖాన్ని చూస్తూ తన రెండు చేతులతో ఎంతో అప్యాయతగా ఆమెను హత్తుకుంది కోతి. దీంతో కోతిని చేరదీసిన భక్తురాలు.. దానిని తన చేతితో నిమురుతూ శ్రీఆంజనేయ స్త్రోత్రాలను జపించింది. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ 'ఎక్స్'లో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు.. తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ భక్తురాలికి నిజంగా దేవుడి ఆశీర్వాదం లభించినట్లయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 06:42 PM

Advertising
Advertising