ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: చూస్తుంటేనే నోరూరిపోతోంది.. ప్రపంచంలోనే పెద్దదైన ఈ ఐస్ క్రీమ్ ను ఎక్కడ తయారుచేశారంటే..!

ABN, Publish Date - May 28 , 2024 | 05:13 PM

వేసవికాలంలో చాలామందికి చల్లగా ఏమైనా తినాలని, తాగాలని అనిపిస్తుంది. చాలామంది పండ్లు, పళ్ల రసాలు తీసుకున్నా ఐస్ క్రీమ్ అనగానే ఎగిరి గంతేస్తారు. పెద్దలు కూడా ఐస్ క్రీమ్ దగ్గర చిన్నపిల్లలు అయిపోతారు. ఇక చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం చేసే గొడవ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ గోల ఎందుకంటారా? ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

వేసవికాలంలో చాలామందికి చల్లగా ఏమైనా తినాలని, తాగాలని అనిపిస్తుంది. చాలామంది పండ్లు, పళ్ల రసాలు తీసుకున్నా ఐస్ క్రీమ్ అనగానే ఎగిరి గంతేస్తారు. పెద్దలు కూడా ఐస్ క్రీమ్ దగ్గర చిన్నపిల్లలు అయిపోతారు. ఇక చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం చేసే గొడవ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ గోల ఎందుకంటారా? ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐస్ క్రీమ్ ప్రియులు ఈ వీడియో చూసి లొట్టలేస్తున్నారు. ఇంతకీ ఇదెక్కడ తయారైందో దీని విశేషాలేంటో తెలుసుకుంటే..

ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!


ఐస్ క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే.. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐస్ క్రీమ్ గురించి తెలిస్త్ షాకవుతారు. ప్రపంచంలోనే అతి పెద్దైన ఈ ఐస్ క్రీమ్ ఒకటి లేదా రెండు అడుగులు ఉందనుకుంటే పొరపాటే. దీని పొడవు అక్షరాలా 10 అడుగులా 1.26 అంగుళాలు. ఈ ఐస్ క్రీమ్ తయారీ చివరి ఏదాదిలో జరిగింది. కానీ తాజాగా ఇది గిన్నీస్ వరల్ట్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఐస్ క్రీమ్ తయారీ ప్రక్రియ మొత్తం వీడియో రూపంలో అందుబాటులో ఉంది. ఇది నార్వేజియన్ కంపెనీ చేత తయారుచేయబడింది. దీన్ని తయారు చేయడానికి 60 లీటర్ల చాక్లెట్, 110 కిలోల వాఫర్స్ వినియోగించారు. దీన్ని ఎత్తడానికి హెలికాఫర్ట్ ను ఉపయోగించారు. ఈ ఐస్ క్రీమ్ కోన్ లో 1000 లీటర్ల ఐస్ క్రీమ్ పడుతుందని అన్నారు. సుమారు 10,800 మంది రెండు స్కూప్ ల చెప్పున ఈ ఐస్ క్రీమ్ ను తినగలరట.

మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..


ఈ వీడియోను guinnessworldrecords అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు. చాలామంది ఈ వీడియో చూసి స్పందిస్తున్నారు. 'నేను అనుకున్నదాని కంటే ఇది చాలా పెద్దది' అని ఒకరు కామెంట్ చేశారు. 'దీనికి గిన్నీస్ రికార్ట్ రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు' అని మరొకరు అన్నారు. ఇక ఐస్ క్రీమ్ ప్రియులు ఈ వీడియో చూసి లొట్టలు వేస్తున్నారు.

మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..

ధ్యానం చేయడం కష్టంగా అనిపిస్తోందా? ఇలా ఈజీగా చేసేయచ్చు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 28 , 2024 | 05:13 PM

Advertising
Advertising