ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రోడ్డుపై కార్లను వదిలి.. జేబులో చేతులు పెట్టుకొని

ABN, Publish Date - Oct 24 , 2024 | 03:34 PM

బెంగళూరులోని ఐటీ హబ్‌కు వెళ్లే వారికి ఈ మార్గం ప్రధాన మార్గం కావడంతో.. అందరు ఇటుగానే ప్రయాణిస్తున్నారు. దాంతో వాహనదారులు గంటలు గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చక్కబడే వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఐటీ హబ్ బెంగళూర్‌లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కొని బయట పడటం అంతా ఈజీ కాదు. బెంగళూర్‌లో రద్దీ గురించి ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మడివాల వైపు ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ వాహనాలతో నిండిపోయింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెండున్నర గంటల సమయం అయినా వాహనాలు ముందుకు కదిలి పరిస్థితి లేదు. దీంతో కొందరు తమ వాహనాలను అక్కడే వదిలి వెళుతున్నారు. అలా వెళ్లే వారిని కొందరు ఫొటోలు, వీడియోలు తీశారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.


సాధారణంగానే బెంగళూర్‌లో ట్రాఫిక్ ఉంటుంది. వర్ష బీభత్సం వల్ల పరిస్థితి పూర్తిగా మారింది. బొమ్మనహళ్లి నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వైపు సిచుయేషన్ దారుణంగా ఉంది. రోడ్డు మీద వేలాది వాహనాలను చూడొచ్చు. ఒక్కో కారు కదిలితే ఒట్టు. ఇంటికి చేరాలంటే గంటల పాటు వెయిట్ చేయాల్సిందే. ఫ్లై ఓవర్ మీద కూడా భారీగా వాహనాలు కనిపించాయి. బెంగళూర్ ఐటీ హబ్‌కు వెళ్లే వారికి ఈ దారి ప్రధాన మార్గం. అందరూ ఈ వైపున ప్రయాణించడంతో ట్రాఫిక్ మరి ఎక్కువగా ఉంది.


ట్రాఫిక్ దృష్ట్యా పోలీసులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ సిచుయేషన్ ఏ మాత్రం మారలేదు. ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో డ్రైనేజీతోపాటు ట్రాఫిక్ సమస్య తీర్చేలా చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. బెంగళూర్‌లో ట్రాఫిక్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు.


ఆ పోస్టుకు తెగ లైకులు వస్తున్నాయి. కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘సిటీలో ట్రాఫిక్ సమస్య గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో అత్యవసర వైద్య సహాయం కావాలంటే పరిస్థితి ఏంటి. ఎమర్జెన్సీ ఉన్న వారు జీవితంపై ఆశ వదులుకోవాల్సిందే అని ఓ యూజర్ కామెంట్ చేశారు.


రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీస్ నుంచి సాయంత్రం 5.20 గంటలకు బయటకు వచ్చా. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి ఇప్పుడే చేరుకున్నా. మిగతా ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. వాహనాలను వదిలి కాలినడకన ఇంటికి చేరుకుంటున్నారు అని మరో యూజర్ రాసుకొచ్చారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Oct 24 , 2024 | 06:46 PM