ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: విమానం అద్దెకు తీసుకుని డబ్బుల వర్షం కురిపించాడు.. కాబోయే కోడలికి ఊహకందని గిఫ్ట్..

ABN, Publish Date - Dec 28 , 2024 | 05:59 PM

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తీరు చూస్తే ఆనందపడాలో, ఆందళనకు గురవ్వాలో తెలియదు. పెళ్లి సందర్భంగా ఆ వ్యక్తి ఎవ్వరూ ఊహించని పని చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లో ఈ ఘటన జరిగింది.

Father in law rented a plane and showered money on his daughter-in-law's house

పాకిస్తాన్ (Pakistan) చాలా కాలంగా ఆర్థిక కష్టాలతో కునారిల్లుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా సతమతమవుతోంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ దేశానికి చెందిన కొందరు వ్యక్తులు కళ్లు చెదిరే రీతిల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లి (Wedding) కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తీరు చూస్తే ఆనందపడాలో, ఆందళనకు గురవ్వాలో తెలియదు. పెళ్లి సందర్భంగా ఆ వ్యక్తి ఎవ్వరూ ఊహించని పని చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లో ఈ ఘటన జరిగింది (Viral Video).


పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ నగరానికి చెందిన వరుడి తండ్రి దుబారా ఖర్చుతో తారస్థాయికి తీసుకెళ్లాడు. తనకు కాబోయే కోడలి ఇంటిపై లక్షల రూపాయల నగదును వర్షంలా కురిపించాడు. అందుకోసం అతడు ఓ జెట్‌ను అద్దెకు తీసుకుని, వధువు ఇంటిపై చక్కర్లు కొట్టించాడు. ఆ సమయంలో ఆ విమానం నుంచి కరెన్సీ నోట్లను కిందకు జారవిడిచాడు. వధువు ఇంట్లోని వారు ఆ కరెన్సీ నోట్ల కోసం పోటీలు పడ్డారు. చాలా మంది ఆ ఘటనను వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. @amalqa అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది.


ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు వరుడి తండ్రి ప్రవర్తనను చాలా మంది నెటిజన్లు తప్పుపట్టారు. ``వరుడి తండ్రి విమానం అద్దెకు తీసుకుని, డబ్బుల వర్షం కురిపించాడు. తండ్రి చేసిన అప్పు తీర్చడానికి ఆ వరుడు జీవితాంతం కష్టపడాలేమో``, ``మీ డబ్బును ఎలా ఖర్చు చేయకూడదు అనేదానికి ఇది ఒక ఉదాహరణ``, ``వరుడిని మరచిపోండి; వధువు ఇరుగుపొరుగు వారు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఐరన్ బాక్స్ లేకపోతేనేం.. తెలివి ఉంది కదా.. ఓ వ్యక్తి షర్ట్‌ను ఎలా ఇస్త్రీ చేస్తున్నాడో చూడండి..


Shocking: ఇదెక్కడి విచిత్రం.. పక్షి కడపులో నుంచి బయటపడుతున్న చేప.. అసలేం జరిగిందంటే..


Viral News: బెడ్‌షీట్‌పై కాఫీ చుక్కలు.. కస్టమర్‌కు దిమ్మదిరిగే షాకిచ్చిన హోటల్ సిబ్బంది..


Optical Illusion Test: గుడ్ల గూబల మధ్యన పిల్లి.. మీ కళ్లు పవర్‌ఫుల్ అయితేనే 10 సెకెన్లలో పట్టుకోగలరు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 28 , 2024 | 05:59 PM