Viral Video: వామ్మో.. టైర్ పేలితే ఎఫెక్ట్ ఇలా ఉంటుందా? ఆ వ్యక్తి గాల్లోకి ఎలా ఎగిరిపడ్డాడో చూడండి..
ABN, Publish Date - Dec 23 , 2024 | 05:33 PM
టైర్ పేలినపుడు వెలువడే శక్తి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే. ఆ వీడియోలో టైర్ పేలవడం వల్ల ఏకంగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.
సాధారణంగా బస్సులు లేదా వాహనాలు టైర్లు (Tyre) పేలడం చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. వాహనాలు నడిచేటపుడు పేలితే యాక్సిడెంట్లు అయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే టైర్ పేలినపుడు వెలువడే శక్తి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే. ఆ వీడియోలో టైర్ (School Bus Tyre) పేలవడం వల్ల ఏకంగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాతీయ రహదారి 66లోని కోటేశ్వర్ సమీపంలో టైరు పంక్చర్ షాపు వద్ద 19 ఏళ్ల అబ్దుల్ రజీద్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం ఒక స్కూల్ బస్సు టైర్‌కు పంక్చర్ అయి ఆ షాప్ దగ్గరకు వచ్చింది. మెకానిక్ అబ్దుల్ ఆ టైర్‌కు పంక్చర్ వేసి గాలి నింపాడు. అయితే ఉన్నట్టుండి ఆ టైర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దాంతో అక్కడే ఉన్న అబ్దుల్ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడ్డాడు. దీంతో అబ్దుల్ తలకు బలమైన గాయమైంది.
స్థానికులు వెంటనే అబ్దుల్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. గత శనివారం ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివిధ సామాజిక మాధ్యమ హ్యాండిల్స్ ద్వారా షేర్ అయిన ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: కారు ముందుకు వెళ్లకుండా చుట్టుముట్టిన ఆవులు.. ఆసలేం జరిగిందో తెలిస్తే.. వీడియో వైరల్..
Oreo Biscuits: వామ్మో.. ఓరియో బిస్కెట్స్ అంత ప్రమాదకరామా? బిస్కెట్లలో కేన్సర్ కారక రసాయనాలు..?
Viral Video: ఆ యువతి వెంటనే స్పందించకపోతే.. ఊహించడమే కష్టం.. షాకింగ్ వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 23 , 2024 | 05:33 PM