Share News

Viral Video: వామ్మో.. టైర్ పేలితే ఎఫెక్ట్ ఇలా ఉంటుందా? ఆ వ్యక్తి గాల్లోకి ఎలా ఎగిరిపడ్డాడో చూడండి..

ABN , Publish Date - Dec 23 , 2024 | 05:33 PM

టైర్ పేలినపుడు వెలువడే శక్తి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే. ఆ వీడియోలో టైర్ పేలవడం వల్ల ఏకంగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది.

Viral Video: వామ్మో.. టైర్ పేలితే ఎఫెక్ట్ ఇలా ఉంటుందా? ఆ వ్యక్తి గాల్లోకి ఎలా ఎగిరిపడ్డాడో చూడండి..
Man Tossed In Air After School Bus Tyre Burst

సాధారణంగా బస్సులు లేదా వాహనాలు టైర్లు (Tyre) పేలడం చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. వాహనాలు నడిచేటపుడు పేలితే యాక్సిడెంట్లు అయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే టైర్ పేలినపుడు వెలువడే శక్తి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే. ఆ వీడియోలో టైర్ (School Bus Tyre) పేలవడం వల్ల ఏకంగా గాల్లోకి ఎగిరి కింద పడ్డాడు. ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).


కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాతీయ రహదారి 66లోని కోటేశ్వర్ సమీపంలో టైరు పంక్చర్ షాపు వద్ద 19 ఏళ్ల అబ్దుల్ రజీద్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం ఒక స్కూల్‌ బస్సు టైర్‌కు పంక్చర్‌ అయి ఆ షాప్ దగ్గరకు వచ్చింది. మెకానిక్ అబ్దుల్ ఆ టైర్‌కు పంక్చర్ వేసి గాలి నింపాడు. అయితే ఉన్నట్టుండి ఆ టైర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. దాంతో అక్కడే ఉన్న అబ్దుల్‌ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరిపడ్డాడు. దీంతో అబ్దుల్ తలకు బలమైన గాయమైంది.


స్థానికులు వెంటనే అబ్దుల్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. గత శనివారం ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వివిధ సామాజిక మాధ్యమ హ్యాండిల్స్ ద్వారా షేర్ అయిన ఈ వీడియోను లక్షల మంది వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కారు ముందుకు వెళ్లకుండా చుట్టుముట్టిన ఆవులు.. ఆసలేం జరిగిందో తెలిస్తే.. వీడియో వైరల్..


Optical Illusion Test: మీ అబ్జర్వేషన్ సూపర్ అయితే.. వీటిల్లో భిన్నమైన ఐస్‌క్రీమ్‌ను 7 సెకెన్లలో పట్టుకోండి..


Oreo Biscuits: వామ్మో.. ఓరియో బిస్కెట్స్ అంత ప్రమాదకరామా? బిస్కెట్లలో కేన్సర్ కారక రసాయనాలు..?


Viral Video: ఆ యువతి వెంటనే స్పందించకపోతే.. ఊహించడమే కష్టం.. షాకింగ్ వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 23 , 2024 | 05:33 PM