Share News

Viral Video: అచ్చం మనిషిలాగానే పరిగెడుతున్న కోతి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ABN , Publish Date - Dec 01 , 2024 | 04:08 PM

మానవుల పూర్వీకులు కోతులని అంటుంటారు. ఇది నిజమో, కాదో అనే అనుమానం ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే. ఆ వీడియో చూసిన తర్వాత మానవులు కోతుల నుంచే పుట్టారని నమ్మక తప్పదు.

Viral Video: అచ్చం మనిషిలాగానే పరిగెడుతున్న కోతి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Monkey walking like humans

మనుషులు కోతుల (Monkey) నుంచే పుట్టారని ఎప్పట్నుంచో వింటూనే ఉన్నాం. మానవుల పూర్వీకులు కోతులని అంటుంటారు. ఇది నిజమో, కాదో అనే అనుమానం ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడాల్సిందే. ఆ వీడియో చూసిన తర్వాత మానవులు కోతుల నుంచే పుట్టారని నమ్మక తప్పదు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కోతి నడక, పరుగు చూస్తే అచ్చం మనిషిలాగానే ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పార్క్‌లో కోతి నడుచుకుంటూ వస్తోంది. రెండు కాళ్ల మీద పూర్తిగా మనిషి లాగానే నడుస్తోంది. అలా కొద్ది దూరం నడిచిన తర్వాత కోతి ఒక్కసారిగా దేనినో చూడి భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తింది. ఆ పరుగు కూడా రెండు కాళ్ల మీదనే మనుషులు పరిగెత్తినట్టే పరిగెత్తింది. కాకపోతే, మనుషులు అందుకోలేనంత వేగంతో పరుగులు పెట్టింది. ఆ కోతి చేష్టలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 60 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 73 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఈ కోతి మనకంటే వేగంగా పరిగెడుతోంది``, ``ఆ కోతి కొద్ది రోజుల తర్వాత మనిషిలా మారిపోతుందేమో``, ``అది మన పూర్వీకురాలు``, ``ఈ కోతి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇతని మీద ఇతనికి ఎంత నమ్మకమంటే.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..


Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరింది.. ఫుట్‌బాల్‌కు నిప్పు అంటించి గేమ్.. ఏం జరిగిందో చూస్తే కళ్లు తిరగడం ఖాయం..


Viral video: వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.. వరుడిని పరుగులు పెట్టించిన కుర్రాడు.. అసలేం జరిగిందంటే..


Viral Video: అదృష్టమే కాపాడింది.. డివైడర్‌ను ఢీకొని గాల్లోకి ఎగిరిన బైక్.. ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 01 , 2024 | 04:08 PM