ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: మందు తాగిన కుక్క పిల్ల.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..!

ABN, Publish Date - Jan 07 , 2024 | 03:01 PM

సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ కుక్క పిల్లకు కొందరు యువకులు మందు తాపుతూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవగా.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Puppy Consume Alcohol

Viral Video: సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఓ కుక్క పిల్లకు కొందరు యువకులు మందు తాపుతూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవగా.. జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియో పోలీసుల కంట పడటంతో చర్యలు తీసుకుంటామని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో కొందరు యువకులు కుక్కపిల్లకు మద్యం తాపించారు. ఓ గ్లాస్‌లో మందు పోసి దాని ముందు పెట్టగా.. అది తాగేసింది. కుక్కపిల్ల మందు తాగుతుండగా.. యువకులు నవ్వుతూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. ఇక దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. అయితే, ఈ వీడియో కాస్తా మాధోపూర్ పోలీసుల కంట పడగా.. తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. ఈ మేరకు పోలీసులు సైతం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఆల్కాహాల్ కుక్కలకు హానీకరం..

కుక్కలకు ఆల్కాహాల్ తాపడం వలన వాటి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని వెటర్నరీ డాక్టర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా వాటి కేంద్ర నాడీ వ్యవస్థ బలహీనమవుతుందంటున్నారు. తక్కువ మద్యం తాగినప్పటికీ.. కుక్కలపై అధిక ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఆల్కాహాల్ కుక్కల్లో జీవక్రియ అసిడోసిస్ అనే ప్రాణాంతక పరిస్థితిని ప్రేరేపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. అసిడిటీ పెరిగి శ్వాసకోశ సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒక్కోసారి కుక్కలకు మూర్ఛ కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 03:04 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising