Viral Video: భారతీయ మహిళలతో పెట్టుకుంటే.. ఈవీ కార్‌ను ఇలా కూడా వాడుకోవచ్చా.. వీడియో వైరల్..
ABN, Publish Date - Dec 30 , 2024 | 07:57 PM
ఎంత కష్టమైన సమస్యకైనా సులభమైన పరిష్కారం కనుగొనడంలో మన వాళ్లు సిద్ధహస్తులు. ముఖ్యంగా భారతీయ మహిళలు ఈ విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తుంటారు. వంటింట్లో రకరకాల ప్రయోగాలు చేస్తూ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంటారు.
అవసరం అనేది నూతన ఆవిష్కరణకు (Innovation) తల్లి లాంటిది. ఎంత కష్టమైన సమస్యకైనా సులభమైన పరిష్కారం కనుగొనడంలో మన వాళ్లు సిద్ధహస్తులు. ముఖ్యంగా భారతీయ మహిళలు ఈ విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తుంటారు. వంటింట్లో రకరకాల ప్రయోగాలు చేస్తూ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. (Viral Video)
@HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంట్లో కియా కంపెనీకి చెందిన ఈవీ కారు (EV Car) పార్క్ చేసి ఉంది. ఇంట్లో కరెంట్ (Electricity) పోవడంతో మహిళలు మిక్సీ పట్టడానికి సమస్య ఎదురైంది. దీంతో ఆ మహిళ ఈవీ కార్ బ్యాటరీ నుంచి కరెంట్ తీసుకుని చక్కగా మిక్సీ (Mixer) పడుతున్నారు. కారు బ్యాటరీకి డైరెక్ట్‌గా మిక్సీ వైర్ తగిలించి టేబుల్‌పై మిక్సీ పెట్టి పని చేసుకుంటున్నారు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 6.8 లక్షల మంది వీక్షించారు. ఐదు వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ``ఈవీ కార్లను కనిపెట్టిన వారు కూడా ఇది ఊహించి ఉండరు``, ``భారతీయ మహిళలు ఏదైనా చేయగలరు``, ``ఈ కారును ఇన్వెర్టర్‌లా ఉపయోగించుకోవచ్చనే తెలివితేటలు అద్భుతం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: విచిత్రమైన ఫ్రెండ్‌షిప్.. కుక్క, పీత కలిసి ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 30 , 2024 | 07:57 PM