ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Design: ఆధార్ కార్డ్ మాదిరిగా పెళ్లి ఆహ్వానం.. పిక్స్ నెట్టింట వైరల్

ABN, Publish Date - Dec 16 , 2024 | 02:48 PM

ఇంతకు ముందు వెడ్డింగ్ కార్డ్‌లు చాలా సింపుల్‌గా ఉండేవి. అందులో దేవుడి చిత్రం, వివాహానికి సంబంధించిన సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. పెళ్లి కార్డులను సరికొత్త మోడళ్లలో తయారు చేయించుకుంటున్నారు. అలాంటిదే ఇప్పుడు ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Wedding Invitation viral

ప్రతి ఒక్కరూ వారి వివాహాన్ని గుర్తుండిపోయేలా చేసుకోవాలని భావిస్తారు. అందుకోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రత్యేకమైన పెళ్లి కార్డులను రూపొందించుకోవడం, గెస్టులకు గిఫ్టులు అందించడం వంటివి చేస్తారు. అయితే ఇటివల ఓ పెళ్లి జంట కూడా తమ పెళ్లి గురించి అనేక మంది చర్చించుకునేలా చేసింది. అయితే వారు ఏం చేసి వార్తల్లో నిలిచారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ జంట వారి పెళ్లి కార్డును ఆధార్ కార్డు థీమ్‌ ఆధారంగా తయారు చేయించుకున్నారు. ఇది చూసిన పలువురు నిజంగా అది ఆధార్ కార్డా లేక పెళ్లి పత్రికనా అని ఆశ్చర్యపోతున్నారు.


పలు రకాలుగా కామెంట్లు

మొదటి సారి చూసినప్పుడు అది నిజంగా ఆధార్ కార్డు అని అనేక మంది అనుకుంటారు. కానీ తీక్షణంగా చూస్తే గాని తెలియదు. ఇక దానిపై వ్రాసి ఉన్న వివరాలను చదివిన తర్వాత అది పెళ్లి కార్డు అని స్పష్టమవుతుంది. ఇది చూసిన అనేక మంది ఐడియా అదుర్స్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఆధార్ కార్డ్ ఫార్మాట్‌ పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆహ్వాన పత్రిక 2017 సంవత్సరానికి చెందినది కావడం విశేషం. అది ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత 2024లో వైరల్ అవుతోంది.


బార్ కోడ్‌లు కూడా

ఓ యూజర్ ఆధార్ కార్డ్ మాదిరిగా ఉన్న ఈ వివాహ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ కార్డులోని వధూవరుల పేర్లు మధ్యప్రదేశ్‌లోని పిపారియా గ్రామానికి చెందిన ప్రహ్లాద్, వర్ష అని ఉన్నాయి. అంతేకాదు ఆధార్ నంబర్‌కు బదులుగా, కార్డులో వారి పెళ్లి తేదీ జూన్ 22, 2017 అని కనిపిస్తుంది. మరిన్ని వివరాల కోసం QR కోడ్, బార్‌కోడ్‌తో పాటు జంట ఫోటోలు క్రింద ఇవ్వబడ్డాయి.

ప్రస్తుతం పెళ్లి కార్డుల్లో ఇలాంటి ప్రయోగాలు చేయడం సర్వసాధారణమైపోయింది. పలువురు తమ అభిమాన రాజకీయ పార్టీకి ఓటు వేయమని కూడా గతంలో వివాహ కార్డులు వెలుగులోకి రావడం చుశాం. కానీ 2017లోనే ఇలాంటి ప్రయోగం చేయడం గ్రేట్ అని పలువురు అంటున్నారు.


ఇవి కూడా చదవండి..

Shocking: వందల కోట్ల లాటరీ గెలిచాడు.. జీవితం మారిపోతుందనుకున్నాడు.. కొన్ని రోజులకే ఊహించని సీన్..


Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: వామ్మో.. ట్రాక్టర్‌ను తోయబోయి ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని
ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 16 , 2024 | 02:52 PM