ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: భారతీయుడే భర్తగా కావాలంటూ వచ్చిన రష్యా యువతి.. ఎయిర్‌పోర్టులో ఆఫీసర్ చేసిన పనికి..

ABN, Publish Date - Apr 27 , 2024 | 07:00 PM

ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని పాస్‌పోర్టు ఆఫీసర్ తనతో అమర్యాదగా ప్రవర్తించాడని ఓ రష్యా యువతి ఆరోపించింది. తన టిక్కెట్‌పై అతడి ఫోన్ నెంబర్ రాసిచ్చి కాల్ చేయమన్నాడని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇంటర్నెడ్ డెస్క్: భారత్ అంటే ఎంతో అభిమానమని చెప్పే ఓ రష్యా యువతి తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. ఎయిర్‌పోర్టులో ఓ పాస్‌పోర్టు ఆఫీసర్ చేసిన పనికి షాకయ్యానంటూ ఆమె తన ఆవేదన నెట్టింట పంచుకుంది. ఓ ప్రభుత్వ అధికారి ఇలా చేయడం భావ్యమా? అని ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

రష్యాకు చెందిన దినారా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (Russia Vlogger). ఆమెకు దాదాపు 78 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకు భారత్ అంటే పట్టలేనంత అభిమానం. ఈ అభిమానం కారణంగా ఆమె భారతీయుడినే పెళ్లాడాలని నిర్ణయించుకుంది. ఇటీవల పూణెలో పర్యటించిన ఆమె ఓ బస్‌స్టాండ్‌లో భారతీయుడిని పెళ్లాడాలని ఉందంటూ పోస్టర్లు అంటించింది. అందులో తన సోషల్ మీడియా ప్రొఫైల్ క్యూఆర్ కోడ్ కూడా జత చేసింది. ఈ వీడియో వైరల్ విపరీతంగా వైరల్ అయ్యింది.

Viral: ఇలాంటి సీన్ చూడాలంటే పెట్టిపుట్టాలి.. అద్భుత వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!


ఈ చర్య పర్యవసానం ఆమెకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో (Delhi Airport) ఎదురైంది. అక్కడ ఓ పాస్‌పోర్టు ఆఫీసర్ (Passport Officer) అతడి ఫోన్ నెంబర్‌ను తన విమానం టిక్కెట్టు వెనకవైపు రాసి ఇచ్చి మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు తనకు ఫోన్ చేయమన్నాడని పేర్కొంది. ‘‘ఓ అధికారి చేయాల్సింది ఇదేనా? నేను చాలా షాకైపోయా’’ అంటూ ఆమె ఓ వీడియోను నెట్టింట పంచుకుంది (Whats This Behaviour Russian Vlogger Shares Ordeal At Delhi Airport ).

ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో ఏకంగా 29 లక్షల వ్యూస్ వచ్చాయి. జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. అనేక మంది పాస్‌పోర్టు అధికారి తీరును ఖండించారు. ఇది సరైన ప్రవర్తన కాదని కుండబద్దలు కొట్టారు. కొందరు మాత్రం అతడికి మద్దతుగా నిలిచారు. కొన్ని సందర్భాల్లో ఆసియా ప్రాంతాల వాళ్లు అతిథి మర్యాదల్లో కాస్తంత అతి చేస్తారని, ఇది దురర్ధాలకు దారి తీసేప్రమాదం ఉందని చెప్పారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.


Read Viral and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 07:09 PM

Advertising
Advertising