Viral: మీ ఇంట్లో వేరే వాళ్లు ఉంటున్నారంటూ పక్కింటి వ్యక్తి నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే..
ABN, Publish Date - Mar 24 , 2024 | 08:17 PM
బ్రిటన్‌లో కొంతకాలం క్రితం జరిగిన ఓ రియలెస్టే్ట్ మోసం మరోసారి నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: రియలెస్టేట్ రంగంలో జరిగే మోసాల గురించి చాలా మందికి తెలిసిందే కానీ కొన్ని ఘటనలు మాత్రం నోరెళ్లబెట్టేలా చేస్తుంటాయి. అలాంటి ఓ ఉదంతం బ్రిటన్‌లో (UK) వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట్లో వైరల్‌గా (Viral) మారింది.
బ్రిటన్‌కు చెందిన రెవరెండ్ మైక్ హాల్ 1990ల్లో ల్యూటన్ టౌన్‌లో ఓ ఇల్లు కొన్నాడు. అతడు మాత్రం వృత్తి రీత్యా వేరే ప్రాంతంలో ఉంటాడు. 2021 ఆగస్టులో ఓ రోజు ల్యూటన్‌లో తన పక్కింటి వారి నుంచి ఫోన్ వచ్చింది. తన ఇంట్లో కొత్త వాళ్లు ఎవరో ఉంటున్నారని, లైట్లు వెలుగుతున్నాయని వాళ్లు చెప్పారు.
Viral: కాళ్లకు క్రాకర్స్ కట్టుకుని చీర కట్టులో పిల్లి మొగ్గ వేసిన యువతి.. షాకింగ్ వీడియో! చివరకు..
దీంతో, హుటాహుటీన ల్యూటన్‌కు వచ్చిన మైక్ తన ఇల్లు గుర్తుపట్టలేనంతగా మారిపోవడం చూసి షాకైపోయాడు. ఇంటి తాళం తెరవబోతుండగా కీ పట్టలేదు. ఈలోపు లోపలి నుంచి మరో వ్యక్తి తలుపు తీసేసరికి మైక్ నిర్ఘాంతపోయాడు. తాము ఈ ఇల్లు కొనుక్కున్నామని అతడు చెప్పడంతో మైక్‌కు నోటమాట రాలేదు. అసలు ఏం జరిగిందో ఆరా తీస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గర్తుతెలియని వ్యక్తులు కొందరు మైక్ ఫేక్ ఐడీతో ఆ ఇల్లు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు (Luton Town Man Returned Home To Find It Was Sold To Someone). ఆ తరువాత రెండేళ్ల పాటు మైక్ కోర్టుల చుట్టూ తిరిగాక ఎట్టకేలకు న్యాయం దక్కింది. ఆ ఇల్లు అతడి పేరిట రిజిస్టరైంది.
ఆ తరువాత రెండు నెలలకు మైక్ మళ్లీ ఇంటికొచ్చి చూస్తే పగిలిన కిటికీ అద్దాలు కనిపించాయి. దీంతో, తన ఇంట్లో ఎవరో కొన్ని రోజుల పాటు తలదాచుకున్నట్టు అర్థమైంది. మొత్తం 60 వేల పౌండ్లకు పైగా ఇంటికి నష్టం ఏర్పడింది. దీంతో, మైక్ చేసేదేం లేక నష్టపరిహారం కోరుతూ ఇటీవల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాడు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 24 , 2024 | 08:24 PM