ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Flemingos: శీతాకాలపు అతిథులు.. మనదేశంలో ఫ్లెమింగోలను ఎక్కడెక్కడ చూడొచ్చంటే..

ABN, Publish Date - Jan 09 , 2024 | 03:52 PM

చలికాలంలో అందమైన పింక్ ఫ్లెమింగోలకు భారతదేశం స్వాగతం పలుకుతుంది. ఏటా గ్రేటర్, లెస్సర్ ఫ్లెమింగోలు

చలికాలంలో అందమైన పింక్ ఫ్లెమింగోలకు భారతదేశం స్వాగతం పలుకుతుంది. ఏటా గ్రేటర్, లెస్సర్ ఫ్లెమింగోలు మన దేశానికి వలస వస్తుంటాయి. అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, ఇజ్రాయెల్‌ సహా వివిధ ప్రాంతాల నుంచి ఇండియా క్యూ కట్టేస్తాయి. భారత్ లో ఎక్కడెక్కడ వాటికి అనువైన పరిస్థితులు ఉన్నాయో చూసుకుంటాయి. అక్కడ కొన్నాళ్లు ఉండి వెళ్లిపోతాయి. ఫ్లెమింగోలు ఎక్కువ ఉండే ప్రాంతాలు మనదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చిలికా సరస్సు భారతదేశంలో అతిపెద్ద తీర సరస్సు. అందమైన పింక్ ఫ్లెమింగోలతో సహా వలస పక్షులకు ఈ ప్రదేశం స్వర్గధామం. శీతాకాలం వేలాది ఫ్లెమింగోలు చిలికాకు తరలి వస్తాయి. ఈ వలస పక్షులు సరస్సును తమ నివాసంగా మార్చుకునే నవంబర్, ఫిబ్రవరి మధ్య సందర్శనకు ఉత్తమ సమయం.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో ఉన్న పులికాట్ సరస్సు భారతదేశంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇక్కడా ఫ్లెమింగోలు సందడి చేస్తుంటాయి. గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్ విస్తారమైన తెల్లని ఉప్పు ఎడారి. శీతాకాలంలో కచ్‌లోని బురద నేలలు, చిత్తడి నేలలు ఈ సొగసైన పక్షులకు తాత్కాలిక నివాసంగా మారతాయి. తమిళనాడు అటవీ శాఖ పులికాట్ ప్రాంతంలోని వీటి రక్షణకు చర్యలు తీసుకుంటోంది.


సందడిగా ఉండే మహానగరం ముంబయిలోనూ ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయి. తూర్పు తీరంలో ఉన్న సెవ్రీ మడ్‌ఫ్లాట్‌లు ఈ సొగసైన పక్షులకు ఆశ్రయం ఇస్తోంది. పుణె నుంచి 100 కి.మీ దూరంలో ఉన్న భిగ్వాన్ కూడా ఫ్లెమింగోలకు స్వర్గధామం. ఈ ప్రాంతాన్ని మహారాష్ట్ర భరత్‌పూర్ అని కూడా పిలుస్తుంటారు. ముంబయి శివార్లలోని థానే క్రీక్ ఫ్లెమింగో అభయారణ్యం సందడిగా ఉండే నగర జీవితం నుంచి ప్రశాంత జీవితాన్ని అందిస్తోంది. ఈ అభయారణ్యాన్ని 2015లో ఏర్పాటు చేశారు. ఐకానిక్ ఫ్లెమింగోలతో సహా వివిధ రకాల ఏవియన్ జాతి పక్షులకు ఈ ప్రాంతం నెలవు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 09 , 2024 | 03:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising