Viral Video: వామ్మో.. ఇలా కూడా బస్సు నడుపుతారా? డ్రైవర్‌కు కండక్టర్ చేస్తున్న సహాయం చూస్తే షాకవ్వాల్సిందే..!
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:56 AM
సాధారణంగా పబ్లిక్ బస్సుల్లో ప్రయాణికులతో వ్యవహరించడానికి కండక్టర్ ఉంటాడు. బస్సులో ప్రయాణీకులను ఎక్కించుకోవడం దగ్గర్నుంచి టిక్కెట్లు ఇవ్వడం, స్టాప్‌లో బస్సు ఆపడం వరకు అతను దగ్గరుండి చూసుకుంటాడు. డ్రైవర్ పూర్తిగా డ్రైవింగ్ మీదనే దృష్టి పెడతాడు.
సాధారణంగా పబ్లిక్ బస్సుల్లో (Bus) ప్రయాణికులతో వ్యవహరించడానికి కండక్టర్ (Bus Conductor) ఉంటాడు. బస్సులో ప్రయాణీకులను ఎక్కించుకోవడం దగ్గర్నుంచి టిక్కెట్లు ఇవ్వడం, స్టాప్‌లో బస్సు ఆపడం వరకు అతను దగ్గరుండి చూసుకుంటాడు. డ్రైవర్ (Driver) పూర్తిగా డ్రైవింగ్ మీదనే దృష్టి పెడతాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియోలో డ్రైవర్ స్టీరింగ్ నడుపుతుంటే, కండక్టర్ గేర్ (Bus gear) మారుస్తున్నాడు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
altu.faltu అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో డ్రైవర్ సీట్లో కూర్చుని స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తున్నాడు. పక్కనే ఉన్న కండక్టర్ కింద కూర్చుని గేర్ మారుస్తున్నాడు. నిజానికి పెద్దగా ఉండాల్సిన గేర్ రాడ్ విరిగిపోయింది. సగం మాత్రమే ఉంది. అది డ్రైవర్‌కు అందదు. దీంతో కండక్టర్ గేర్ రాడ్ పక్కన కూర్చుని అవసరమైనప్పుడల్లా గేర్ మారుస్తున్నాడు. చాలా మంది ప్రయాణికులు బస్సులో కూర్చొని ఉన్నారు. గేర్ రాడ్ విరిగిపోయిన తర్వాత కూడా బస్సును నడుపుతుండడం విమర్శలకు తావిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు దాదాపు 10 లక్షలు వ్యూస్ వచ్చాయి. 40 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ``ప్రయాణికుల జీవితాలతో ఆడుకోవడానికి ఈ వ్యక్తులను ఎవరు అనుమతించారు``, ``అల్ట్రా ప్రో మాక్స్ మాన్యువల్ గేర్ సిస్టమ్``, ``ఇండియాలోనే ఇలాంటివి సాధ్యం``, ``ఆ ప్రయాణికులు ఎంతగా భయపడి ఉంటారో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీ కళ్ల పవర్ ఏంటో తెలుసుకోండి.. వీళ్లలో నిద్రపోతున్న పాపను గుర్తించండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..