ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పోస్టుమార్టం చేస్తున్నప్పుడు శవం కదలుతుందా.. అన్న ప్రశ్నకు.. ఈమె సమాధానం వింటే పగలబడి నవ్వాల్సిందే..

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:56 PM

వినూత్న ప్రయోగాలు, విచిత్ర ఆలోచనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరి ప్రవర్తన చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగితే.. మరికొందరు ప్రవర్తన చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పోస్టుమార్టం చేస్తున్న సమయంలో..

వినూత్న ప్రయోగాలు, విచిత్ర ఆలోచనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరి ప్రవర్తన చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగితే.. మరికొందరు ప్రవర్తన చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పోస్టుమార్టం చేస్తున్న సమయంలో శవం కదులుతుందా.. అంటూ ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అవతల ఉన్న మహిళ వింత సమాధానం చెప్పింది. ఆమె చెప్పింది విని అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పోస్టుమార్టంకు (Postmortem) సంబంధించిన విషయాలపై ఓ మహిళను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ‘‘మీరు ఇప్పటిదాకా ఎన్ని మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు’’.. అని ఆ వ్యక్తి మొదటి ప్రశ్నను అడగ్గా.. ‘‘సుమారు 22 నుంచి 23 వేల మృతదేహాలకు పోస్టుమార్టం చేశా’’.. అని ఆమె సమాధానం చెబుతుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆపై అతను అడిగిన ప్రశ్నకు, ఆమె చెప్పిన సమాధానం విని అంతా అవాక్కవుతున్నారు.

Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారే.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..


‘‘పోస్టుమార్టం చేసే సమయంలో శవాలు కదులుతుంటాయని, పైకి లేస్తాయని ప్రజలు అనుకుంటూ ఉంటారు.. ఇది నిజమేనా’’.. అని ఆ వ్యక్తి అడగ్గా.. ఇందుకు ఆమె ‘‘అలా జరగలేదు కానీ.. ఓ సారి ఓ వ్యక్తి మృతదేహం మా వద్దకు వచ్చింది. అతను చనిపోయి 7 నుంచి 8 గంటలు కావస్తుంటుంది. అయితే పోస్టుమార్టం సమయంలో ఓసారి శవం కళ్లు తెరిచింది. దీంతో దాని కళ్లు మూసేశాను. రెండోసారీ ఇలాగే జరిగింది. చివరకు మూడోసారి కూడా అలాగే జరగడంతో నేనే కళ్లను మూసేసి, నువ్వు శవానివి.. ప్రశాంతంగా ఉండు.. అని చెప్పా’’.. అంటూ అతడి ప్రశ్నకు వింతగా సమాధానం చెప్పింది.

Viral Video: ఇతను భవిష్యత్తులో పెద్ద ఇంజినీర్ అవడం పక్కా.. చెప్పుల్లో ఇలాంటి టెక్నాలజీ ఎక్కడైనా చూశారా..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈమె చెప్పిన వింత సమాధానం విని అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఆంటీ చాలా ప్రత్యేకమైన మహిళ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. ఈమెను చూస్తుంటే శవాలు కూడా భయపడతాయేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 1.60 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 22 , 2024 | 12:56 PM