Viral Video: వాహనదారులకు షాక్ ఇచ్చిన మహిళ.. ట్రాఫిక్ జామ్‌ను కూడా ఎలా సద్వినియోగం చేసుకుందంటే..
ABN, Publish Date - Mar 14 , 2024 | 10:59 AM
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ స్కూటీలో వెళ్తుండగా ఉన్నట్టుండి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎంతసేపటికీ క్లియర్ కాకపోవడంతో ఆమెకు ఓ ఐడియా వస్తుంది. ‘‘ఈ సమయాన్ని ఎందుకు వృథా చేయడం’’.. అని అనుకుందే ఏమో గానీ..
ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో చాలా మంది క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక మహిళలైతే అటూ ఇంట్లో పనులు, ఇటూ ఆఫీసు పనులతో విశ్రాంతి లేని జీవితం గడుపుతున్నానే చెప్పొచ్చు. ఈ క్రమంలో ఏమాత్రం తీరిక దొరికినా కొందరు.. ఆ సమయాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ మహిళ ట్రాఫిక్ జామ్ మధ్యలో చేసిన పని అంతా అవాక్కయ్యేలా చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ట్రాఫిక్ జామ్‌ను ఎంత బాగా వాడేశావమ్మా..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ స్కూటీలో వెళ్తుండగా ఉన్నట్టుండి ట్రాఫిక్ జామ్ (Traffic jam) అవుతుంది. ఎంతసేపటికీ క్లియర్ కాకపోవడంతో ఆమెకు ఓ ఐడియా వస్తుంది. ‘‘ఈ సమయాన్ని ఎందుకు వృథా చేయడం’’.. అని అనుకుందే ఏమో గానీ.. వెంటనే స్కూటీ ముందు వైపు బ్యాగులోంచి కూరగాయలను బయటికి తీసింది. స్కూటీ సీటుపై పేపర్ పెట్టి, అందులో కూరగాయలను (vegetables) చేత్తో తరిగేసింది. ఈ పని కోసం వంట గదిలో కేటాయించాల్సిపన సమయాన్ని కాస్తా.. ఇక్కడే సద్వినియోగం చేసుకుంది.
Viral Video: వామ్మో..! ఈమేంటీ.. ట్రైన్‌లో సీటు కోసం మరీ ఇలా చేసిందేంటీ..
ఆమె నిర్వాకం చూసి అక్కడున్న వాహనదారులంతా అవాక్కయ్యారు. చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ నవ్వుకున్నారు. అయినా ఆమె ఎవరినీ పట్టించుకోకుండా కూరగాయలను మొత్తం తరిగేసి, ట్రాఫిక్ జామ్ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయమ్మా.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘ఇది కదా వాడకం అంటే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి వైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Marriage Video: పెళ్లి వేదికపై షాకింగ్ ఘటన.. అతిథులంతా ఒక్కసారిగా వధువుపై పడడంతో.. చివరకు..
Updated Date - Mar 14 , 2024 | 10:59 AM