Viral Video: ఖాళీ బాటిళ్లతో ఈమె చేసిన ప్రయోగం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ABN, Publish Date - Sep 18 , 2024 | 07:25 PM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళకు తన ఇంట్లోని ఖాళీ బాటిళ్లను బయట పడేసే సమయంలో ఓ ఐడియా వచ్చింది. వాటిని పడేకుండా తిరిగి వినియోగంలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందీ.. అని ఆలోచించింది..
దేనికీ పనికి రావు అనుకుని కొన్నింటిని పక్కన పడేస్తుంటాం. అయితే అదే వస్తువులను కొందరు తిరిగి ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు వాటిని తిరిగి వినియోగించే తీరు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. పక్కన పడేసిన సైకిల్ చక్రాలను డైనింగ్ టేబుల్‌గా వినియోగించిన వాళ్లను చూశాం, అలాగే పక్కన పడేసిన పేస్ట్ డబ్బాను కొళాయి మూతలా వాడడాన్ని చూశాం. అదేవిధంగా పాత సైకిల్ పెడల్‌తో బట్టలను వాష్ చేయడం కూడా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళ ఖాళఈ బాలిళ్లతో చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళకు తన ఇంట్లోని ఖాళీ బాటిళ్లను (Empty water bottles) బయట పడేసే సమయంలో ఓ ఐడియా వచ్చింది. వాటిని పడేకుండా తిరిగి వినియోగంలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందీ.. అని ఆలోచించింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలోకి దిగింది. ముందుగా బాటిల్‌ను తీసుకుని, కత్తితో దానికి రెండు వైపులా కొంత భాగాన్ని తొలగించింది.
Viral Video: బ్యూటీఫార్లర్‌కు వెళ్లిన యువతి.. ఆమె తలలోని వెంట్రుకలను చూసి అంతా షాక్..
ఇలా రెండు బాటిళ్లను కట్ చేసి సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత వాటి మధ్యలో గుడ్డ ముక్కలు ఉంచి ప్యాక్ చేసింది. చివరగా ఆ రెండింటిని కలిపి కట్టింది. అదేవిధంగా బాటిల్ మూతను కట్ చేసి, వాటికి మధ్యలో ఏర్పాటు చేసింది. ఇలా మొత్తం పూర్తైన తర్వాత.. బాటిల్ మూత స్థానంలో కర్రను ఉంచి దాన్ని దుమ్ము క్లీన్ చేసే వస్తువుగా మార్చేసింది. చివరగా దాంతో ఫ్యాన్ రెక్కలకు అంటుకున్న మురికిని శుభ్రం చేసింది. ఇలా ఖాళీ బాటిళ్లతో వినూత్న వస్తువులను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Viral Video: గుహలో వీడియో తీసేందుకు వెళ్లగా.. సడన్‌గా ఎలుగుబంటి ఎంట్రీ.. చివరకు అది చేసిన నిర్వాకం..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘పాత బాటిళ్లతో ఇలా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 61 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: తేలును మింగాలని చూసిన కట్ల పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..
Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..
Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 18 , 2024 | 07:25 PM