ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బట్టలు ఆరబెట్టేందుకు.. బకెట్‌‌తో ఈమె చేసిన ప్రయోగం మామూలుగా లేదుగా..

ABN, Publish Date - Jul 07 , 2024 | 08:43 PM

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో కాస్త తెలివిగా ఆలోచించే ప్రతి ఒక్కరికీ.. డబ్బుతో పాటూ ఎక్కడ లేని ఫేమ్ వచ్చిపడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకని చాలా మంది నెట్టింట వైరల్ అయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరు ...

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో కాస్త తెలివిగా ఆలోచించే ప్రతి ఒక్కరికీ.. డబ్బుతో పాటూ ఎక్కడ లేని ఫేమ్ వచ్చిపడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకని చాలా మంది నెట్టింట వైరల్ అయ్యేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొందరు తెలివిగా ఆలోచిస్తూ వింత ప్రయోగాలు చేస్తుంటే.. మరికొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ చిత్రవిచిత్ర ప్రయోగాలు చేసేస్తున్నారు. మొత్తానికి ఇలాంటి వీడియోలన్నీ కలిసి నెటిజన్లకు కాలక్షేపంతో పాటూ కామెడీని కూడా అందిస్తున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ మహిళ దుస్తులు ఆరబెట్టేందుకు బకెట్‌తో వాడిన టెక్నిక్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) బట్టలు ఉతుకుతుంటుంది. ఇందులో విశేషం ఏముందీ అనేగా మీ డౌట్. బట్టలు ఉతకడం (clothes Washing ) వరకూ ఓకే గానీ.. ఉతికిన బట్టలను ఆరబెట్టే క్రమంలో ఆమె చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఉతికిన బట్టలను ఓ బకెట్‌లో తీసుకొచ్చిన ఆమె.. అక్కడే ఓ తాడుకు ఇంకో బకెట్ వేలాడదీసింది. దానికి కట్టిన తాడును అనేకసార్లు మెలికలు తిప్పి ఉంటుంది. చివరగా ఉతికిన బట్టలు అందులో వేసి బకెట్‌ను వదిలేస్తుంది. దీంతో మెలికలు తిరిగిన తాళ్లు మామూలు స్థితికి వచ్చే క్రమంలో బకెట్ గిరగిరా వేగంగా తిరుగుతుంది.

Viral Video: ఫస్ట్ నైట్ రోజు కొత్త జంట విచిత్ర నిర్వాకం.. ఫోన్ కెమెరా ఆన్ చేసి మరీ..


ఇలా బకెట్ వేగంగా తిరగడం వల్ల దుస్తుల్లోని నీరు మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇలా వాషింగ్‌మెషిన్‌లో దుస్తులను ఆరబెట్టిన తరహాలో బకెట్‌తో ఈమె చేసిన ప్రయోగం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘రూపాయి ఖర్చులేని వాషింగ్‌మెషిన్.. చాలా బాగుంది’’... అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గాఢనిద్రలో ఉన్న యువతి.. సడన్‌గా దూసుకొచ్చిన పాము.. చివరకు..

Updated Date - Jul 07 , 2024 | 08:46 PM

Advertising
Advertising
<