ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఫోన్ చూస్తూ ఎస్కలేటర్ ఎక్కిన మహిళ.. చివరకు ఏం జరిగిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN, Publish Date - Sep 13 , 2024 | 08:15 PM

ప్రస్తుత సమాజంలో పిల్లల నుంచి వృద్ధుల వరకూ అంతా స్మార్ట్ ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొందరైతే చుట్టూ ప్రపంచం ఏమవుతున్నా తమకేమీ సంబంధం లేదు అన్నట్లుగా ఫోన్‌కు అంకితమవుతుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ కొందరు..

ప్రస్తుత సమాజంలో పిల్లల నుంచి వృద్ధుల వరకూ అంతా స్మార్ట్ ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. కొందరైతే చుట్టూ ప్రపంచం ఏమవుతున్నా తమకేమీ సంబంధం లేదు అన్నట్లుగా ఫోన్‌కు అంకితమవుతుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ కొందరు ప్రవర్తించే తీరు చూస్తే కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. మరికొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఫోన్ చూస్తూ ఎస్కలేటర్ ఎక్కింది. చివరకు ఏం జరిగిందో చూస్తే అవాక్కవుతారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పెద్ద షాపింగ్ మాల్‌లోకి వచ్చిన ఓ మహిళ (woman) ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. లోపల ఓ వైపు అటూ, ఇటూ తిరుగుతూనే మరోవైపు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. లోపలికి వెళ్లిన ఆమె పై అంతస్థులోకి వెళ్లేందుకు ఎస్కలేటర్ ఎక్కాల్సి వస్తుంది. అయితే కిందకు దిగే ఎస్కలేటర్ పని చేస్తుండగా.. పైకి వెళ్లి ఎస్కలేటర్ మాత్రం ఆగిపోయి ఉంటుంది. ఇదేమీ గమనించిన ఆ మహిళ ఫోన్ చూసుకుంటూనే దానిపై ఎక్కి నిలబడుతుంది.

Viral Video: ఇలాంటి సైకిల్ ఎక్కడైనా చూశారా.. కొనేందుకు డబ్బులు లేక.. చివరకు ఎలా తయారు చేశాడో తెలిస్తే..


ఎస్కలేటర్ ఎటూ కదలకుండా అలాగే ఉండిపోయిందనే విషయాన్ని గమనించని ఆమె ఫోన్‌లోనే మునిగిపోయి ఉంటుంది. ఎక్సలేటర్ పని చేయకపోవడంతో అక్కడున్న చాలా మంది దానిపై నడుస్తూ పైకి వెళ్తుంటారు. కానీ ఈమె మాత్రం అలాగే ఫోన్ చూసుకుంటూ నిలబడి ఉంటుంది. ఎస్కలేటర్ (Escalator) పైకి వెళ్తోందనే భ్రమలోనే ఉండిపోయిన ఆమె.. చాలా సేపు అలా నిలబడే ఫోన్ చూసుకుంటూ ఉండడం గమనార్హం.

Viral Video: దేవుడు మనిషి రూపంలో రావడం అంటే ఇదేనేమో.. సమయానికి వచ్చి ఎలా కాపాడాడో చూస్తే..


అయితే పక్కన ఉన్న వారు ఆమెను పట్టించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోతుంటారు. ఈమెను గమనించిన కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఫోన్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘ఫోన్ పిచ్చి పీక్స్ వెళ్లినట్లుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చుట్టుముట్టిన సింహాలతో జిరాఫీ పోరాటం.. చూస్తుండగానే అంతెత్తుకు జంప్ చేసిన సింహాలు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 13 , 2024 | 08:15 PM

Advertising
Advertising