Share News

Viral: భర్త రూ.5ల కుర్కురే ప్యాకెట్ తేలేదని భారీ షాకిచ్చిన భార్య!

ABN , Publish Date - May 14 , 2024 | 03:29 PM

కుర్కురే స్నాక్స్‌కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ తేకపోవడంతో అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

Viral: భర్త రూ.5ల కుర్కురే ప్యాకెట్ తేలేదని భారీ షాకిచ్చిన భార్య!
UP woman seeks divorce after husband forgets to bring kurkure

ఇంటర్నెట్ డెస్క్: కుర్కురే స్నాక్స్‌కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ కొనుక్కుని రాకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కూడా హాట్ టాపిక్‌గా (Viral) మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, సదరు మహిళకు గతేడాదే వివాహమైంది. ఆమెకు కుర్కురే స్నాక్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ రుచికి ఆమె బానిసైపోయింది. కుర్కురే తినకుండా పూట గడవని స్థితి వచ్చి పడింది. ఆమె వింత వైఖరి కారణంగా దంపతుల మధ్య తగవులు కూడా జరుగుతుండేవి.

ఇటీవల ఓ రోజు మహిళ భర్తకు మరోసారి కుర్కురే ప్యాకెట్ తెమ్మని చెప్పి మార్కెట్‌కు పంపించింది. కానీ అతడు మాత్రం అవి తేకుండానే ఇంటికొచ్చాడు. దీంతో, భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. భర్త తీరుతో విసిగిపోయిన మహిళ చివరకు అదే రోజు పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

Viral: మనిషి రక్తానికి రెండు చుక్కల పాము విషం కలపగానే.. షాకింగ్ వీడియో!


ఆ తరువాత భర్త నుంచి విడాకులు కోరుతూ పోలీసులను ఆశ్రయించింది (Woman Takes seeks divorces After Husband Forgets To Bring Kurkure). మహిళ చెప్పిన కారణం విని తొలుత పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. చివరకు భార్యాభర్తలను ఫ్యామిలీ కౌన్సిలర్ వద్దకు పంపించారు. అయితే, భర్త తనపై చేయి చేసుకున్నాడని కూడా మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు, తన భార్య కుర్కురేకు బానిస కావడంతో కాస్తంత ఆందోళన కలిగిస్తోందని భర్త వాపోయాడు.

కాగా, ఆగ్రాలోనే ఇటీవల మరో వింత ఘటన వెలుగు చూసింది. భార్య రాజకీయాల్లోకి వెళ్లడం ఇష్టం లేని ఓ భర్త ఆమె నుంచి విడాకులు కోరాడు. పోలీసులు అతడిని ప్రశ్నించగా, ఆమె రాజకీయాల్లో వదులుకోకపోతే వివాహబంధంలో ఇమడలేనని స్పష్టం చేశాడు.

Read Viral and Telugu News

Updated Date - May 14 , 2024 | 03:38 PM