ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: వాడకం అంటే ఇదీ..! వాటర్ పౌంటెన్‌ను ఈమె కంటే బాగా ఎవరూ వాడలేరేమో..

ABN, Publish Date - Apr 26 , 2024 | 09:05 PM

కొందరు తెలిసి, మరికొందరు తెలీక చేసే పనులు.. కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. చాలా మంది రోడ్లపై చిత్రవిచిత్ర పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా...

కొందరు తెలిసి, మరికొందరు తెలీక చేసే పనులు.. కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. చాలా మంది రోడ్లపై చిత్రవిచిత్ర పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ నడి రోడ్డుపై వాటర్ పౌంటెన్‌ను వాడుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వాటర్ పౌంటెన్‌ను ఈమె కంటే బాగా ఎవరూ వాడలేరేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై కూడలి మధ్యలో వాటర్ పౌంటెన్‌ను (Water fountain) ఏర్పాటు చేశారు. రాత్రి వేళ ఆకర్షణీయంగా కనిపించేందుకు పౌంటెన్‌కు రంగు రంగుల లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఆ పౌంటెన్‌ వద్ద ఓ మహిళ (woman) చేసిన పనికి అంతా అవాక్కవుతున్నారు. పౌంటెన్ వద్ద బకెట్‌తో వచ్చిన మహిళ.. తీరా అక్కడికి వచ్చాక.. బకెట్ నంచి దుస్తులను (Washing clothes) బయటికి తీసి ఉతకడం మొదలెట్టింది.

Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ రాయి.. వింతగా ఉండడంతో పగులగొట్టి చూడగా..


నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి కదా అని.. దుస్తులన్నింటినీ నీటిలో ముంచడం, పక్కకు తీసి చకచకా ఉతికేయడం స్టార్ట్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు.. మహిళ నిర్వాకానికి అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ వాటర్ పౌంటెన్‌ను ఈమె కంటే బాగా ఎవరూ వాడలేరేమో’’.. అంటూ మరికొందరు, ‘‘ఇండియాలో ఇలాంటి టాలెంట్‌కి కొదవే లేదు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‪‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ప్లైట్‌లో పల్లెటూరి యువతి నిర్వాకానికి ఖంగుతిన్న ఎయిర్‌హోస్టెస్.. ఏంటది.. అని ప్రశ్నించడంతో..

Updated Date - Apr 26 , 2024 | 09:11 PM

Advertising
Advertising