ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఆకలితో ఉందని మహిళ ఆహారం తినిపిస్తే.. చివరకు ఈ నక్క చేసిన నిర్వాకం..

ABN, Publish Date - May 30 , 2024 | 05:21 PM

సోషల్ మీడియాలో రోజూ అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా...

సోషల్ మీడియాలో రోజూ అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లు ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆకలితో ఉన్న నక్కకు ఓ మహిళ ఆహారం తినిపించింది. అయితే చివరకు ఆ నక్క చేసిన నిర్వాకం చూసి అంతా నవ్వుకుంటున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ నక్క (fox) అటవీ సమీప గ్రామంలోకి చొరబడుతుంది. ఆహారం కోస అటూ ఇటూ వెతుకుతూ చివరకు ఓ ఇంటి వద్దకు వచ్చి ఆగుతుంది. నక్క ఆకలితో ఉన్నట్లు గమనించిన మహిళ (woman) .. దానికి ఆహారం అందించి ఆకలి తీర్చుతుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆహారం తిని వెళ్లిపోయిన నక్క.. కాసేపటికి మళ్లీ వచ్చింది. అయితే వచ్చేది అదొక్కటీ రాకుండా.. ఏకంగా తోటి నక్కలన్నింటినీ తీసుకొని వస్తుంది.

Viral Video: చలనం లేకుండా పడి ఉన్న కోతిని.. ఈ పోలీసు క్షణాల్లో ఎలా రక్షించాడో చూడండి..


మూసి ఉన్న తలుపు ఎదురుగా నక్కలన్నీ మహిళ కోసం ఎదురుచూడసాగాయి. సదరు మహిళ డోరు తీయకుండా లోపలి నుంచి ఈ ఘటనను మొత్తం వీడియో తీసింది. మహిళ ఆహారం పెడుతుందని ఆ నక్కలు అలా చాలా సేపు తలుపు ఎదురుగా నిల్చుని ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నాయి. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ నక్క తెలివిగా మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ నక్కను చూస్తుంటే నవ్వొస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: దుస్తులు వేసుకుంటుండగా బాలికకు షాకింగ్ అనుభవం.. ఆస్పత్రిలో వైద్యులు స్కానింగ్ చేసి చూడగా..

Updated Date - May 30 , 2024 | 05:21 PM

Advertising
Advertising