ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు.. రెండు అడుగులు వేయగానే..

ABN, Publish Date - Aug 11 , 2024 | 07:04 AM

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వృత్తి విషయంలో పోటా పోటీ ఉంటుందో లేదో తెలీదు గానీ.. రీల్స్ చేసే విషయంలో మాత్రం నిత్యం పోటీ నడుస్తూనే ఉంటుంది. ఒకరిని మించి మరొకరు వినూత్నంగా రీల్స్ చేసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో...

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వృత్తి విషయంలో పోటా పోటీ ఉంటుందో లేదో తెలీదు గానీ.. రీల్స్ చేసే విషయంలో మాత్రం నిత్యం పోటీ నడుస్తూనే ఉంటుంది. ఒకరిని మించి మరొకరు వినూత్నంగా రీల్స్ చేసేందుకు వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు కొండ ప్రాంతాల్లో (hilly area) వినూత్నంగా రీల్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఇందుకోసం అందమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. కొండ పైనుంచి లోయలోకి దిగి అందమైన స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తే వైరల్ అయిపోవచ్చని భావించాడు. ఇందుకోసం కొండ పైనుంచి లోయలోకి దిగి కెమెరాకు ఫోజులు ఇస్తూ కాసేపు వెనక్కు నడుస్తూ స్టెప్పులు వేశాడు.

Viral Video: అరే.. మరీ విచిత్రంగా ఉందే.. దూసుకెళ్తున్న లారీ.. ఇంజిన్‌లో చూడగా ఫ్యూజులు ఎగిరే సీన్..


ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. కాసేపు వెనక్కు నడవగానే లోయలోకి వేగంగా పడబోయాడు. దీంతో తనని తాను బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో లోయ కింద వైపునకు తిరిగి కాస్త కిందకు వెళ్లి ఆగాలని ప్రయత్నించాడు. అయితే లోయ ఏటవాలు కారణంగా కంట్రోల్ కాలేక వేగంగా కిందకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో (young man fell into valley while doing reels) చివరకు బ్యాలెన్స్ చేసుకోలేక ధబేల్‌మని కిందపడ్డాడు.

Viral Video: రైల్లో ఇలాంటి పని ఇంతవరకూ ఎవరూ చేయలేదేమో.. డోరు వద్ద ఇతడు చేస్తున్న పని చూస్తే..


చూస్తుంటే ఈ ఘటనలో అతడికి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ పిచ్చి ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘అంత ప్రమాదకరమైన లోయలో రీల్స్ చేయడం అవసరమా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 31లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పుస్తకాల లోడుతో వెళ్తున్న వ్యక్తి.. అనుమానం వచ్చి మొదటి పేజీ తీసి చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Aug 11 , 2024 | 07:04 AM

Advertising
Advertising
<