ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అందరి ముందు హీరోలా బిల్డప్ ఇచ్చాడు.. చివరకు జరిగిన ఘటనతో ఖంగుతిన్నాడు..

ABN, Publish Date - Oct 17 , 2024 | 09:18 AM

ఎలాగైనా వైరల్ అవ్వాలనే ఉద్దేశంలో చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు ఏదో చేయాలని చూస్తే.. చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. ఇలాంటి..

ఎలాగైనా వైరల్ అవ్వాలనే ఉద్దేశంలో చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు ఏదో చేయాలని చూస్తే.. చివరకు అసలుకే ఎసరు వస్తుంటుంది. ఇలాంటి విచిత్ర విన్యాసాల వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు అందరి ముందు హీరోలా బిల్డప్ ఇస్తూ బైకులపై విచిత్ర విన్యాసం చేయాలని చూశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన స్నేహితులతో ఛాలెంజ్ చేసి వినూత్న విన్యాసం (stunts) చేసేందుకు సిద్ధమయ్యాడు. రోడ్డుపై మూడు బైకులను (bikes) వరుసగా పార్క్ చేసి, అవతలి వైపు నుంచి ఇవతలి వైపునకు వాటి పైనుంచి దూకాలి. ఇది ఆ యువకుడు చేసిన ఛాలెంజ్. ఎవరూ ముందుకు రాకపోవడంతో తాను చేసి చూపిస్తానంటూ హీరోలా బిల్డప్ ఇచ్చాడు.

Viral Video: కదులుతున్న లారీలో ఇదేం పని.. ఇతడు చేసిన విన్యాసం చూస్తే షాకవ్వాల్సిందే..


అందుకు తగ్గట్టుగానే రోడ్డుపై బైకులను వరుసగా నిలబెట్టారు. సదరు యువకుడు దూరం నుంచి రన్నింగ్ చేస్తూ వచ్చి ఒక్కసారిగా ఆ బైకుల పైకి జంప్ చేశాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. బైకులపై జంప్ చేసిన ఆ వ్యక్తి.. మధ్యలో కాలు బైకు సీటుకు తగలడంతో అదుపు తప్పి ఇవతలి వైపు రోడ్డుపై ధబేల్‌మని కిందపడ్డాడు. ఈ ఘటనలో తన మూతి నేలను బలంగా తాకింది. దీంతో నొప్పిని భరించలేక కుయ్యో.. మొర్రో.. అనుకుంటూ విలవిల్లాడిపోయాడు.

Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ గదిలో దాక్కున్న స్పైడర్‌ను 10 సెకన్లలో గుర్తించండి చూద్దాం..


అతడి కిందపడడం చూసి.. అక్కడే ఉన్న అతడి స్నేహితులు పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని పైకి లేపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలు నిపుణుల సమక్షంలో చేయాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: విధి విచిత్రమైనదంటే ఇదేనేమో.. ప్రమాదం నుంచి ఇతనెలా బయటపడ్డాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 17 , 2024 | 09:18 AM