Viral Video: బార్బర్‌కు షాకిచ్చిన యువకుడు.. సెలూన్‌లో గుండు కొట్టించుకున్న వ్యక్తి.. చివరకు..
ABN, Publish Date - Dec 08 , 2024 | 06:08 PM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది అనేక రకాల వీడియోలు చేస్తూ నెట్టింట్లోకి వదులుతున్నారు. వీటిలో ప్రాంక్ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్‌లు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటే.. మరికొందరు బస్సు, రైల్వే స్టేషన్లు, వివిధ రకాల దుకాణాల వద్ద ప్రాంక్‌లు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇలాంటి..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది అనేక రకాల వీడియోలు చేస్తూ నెట్టింట్లోకి వదులుతున్నారు. వీటిలో ప్రాంక్ వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో ప్రాంక్‌లు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటే.. మరికొందరు బస్సు, రైల్వే స్టేషన్లు, వివిధ రకాల దుకాణాల వద్ద ప్రాంక్‌లు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు సెలూన్ షాపులో బార్బర్‌కు షాక్ ఇచ్చాడు. గుండుతో లోపలికి వెళ్లిన అతను చివరకు ఏం చేశాడో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సెలూన్ షాపులోకి (Salon shop) వెళ్లి గుండు కొట్టించుకున్నాడు. గుండు చేయడం పూర్తయిన తర్వాత బార్బర్ (Barber) పక్కకు వెళ్తాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. బార్బర్ అటు వెళ్లగానే ఆకుర్చీలో కూర్చున్న వ్యక్తి.. తన వద్ద దాచుకున్న విగ్‌ను (Wig) తీసుకుని తలపై పెట్టకుంటాడు.
Viral Video: ఈ కోతి మరీ స్మార్ట్ గురూ.. యువతిని చూడగానే పైకి ఎక్కి మరీ.. చివరకు..
బార్బర్ మళ్లీ తన వద్దకు వచ్చే లోపే విగ్‌ను పెట్టుకుంటాడు. అతడి వద్దకు వచ్చిన బార్బర్.. ఆ వ్యక్తి తలపై మళ్లీ జుట్టు ఉండడం చూసి షాక్ అవుతాడు. ‘‘నేనే స్వయంగా గుండు చేస్తే.. మళ్లీ వెంట్రుకలు ఎలా వచ్చాయబ్బా’’.. అని అనుకుంటూ ఆశ్చర్యంగా అలాగే చూస్తుండిపోతాడు. చివరకు చేసేది లేక మళ్లీ గుండు చేసేందుకు సిద్ధమవుతాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.
Viral Video: మృత్యువును కొనితెచ్చుకోవడం అంటే ఇదే.. బైకుపై విన్యాసాలు చేస్తుండగా.. మధ్యలో..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బార్బర్‌కు భలే షాకిచ్చాడుగా’’.. అంటూ కొందరు, ‘‘చాలా ఫన్నీగా ఉంది ప్రాంక్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9.37 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఈ ట్రిక్ ఎప్పుడైనా ట్రై చేశారా.. చేతి నుంచి గాజులను ఎలా తీస్తుందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 08 , 2024 | 06:08 PM