Viral Video: చలి తగలకుండా ఇలా ఎవరైనా చేస్తారా.. ఇతడి టెక్నిక్ చూస్తే నోరెళ్లబెడతారు..
ABN, Publish Date - Nov 20 , 2024 | 09:24 PM
చలికాలం వచ్చేసిందంటే చాలు.. అంతా స్వెట్టర్లను బయటికి తీస్తారు. లేనివాళ్లు కొని తెచ్చుకుంటుంటారు. చలిని తట్టుకునేందుకు, దాన్నుంచి బయటపడేందుకు కొందరు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి..
చలికాలం వచ్చేసిందంటే చాలు.. అంతా స్వెట్టర్లను బయటికి తీస్తారు. లేనివాళ్లు కొని తెచ్చుకుంటుంటారు. చలిని తట్టుకునేందుకు, దాన్నుంచి బయటపడేందుకు కొందరు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు చలి నుంచి తప్పించుకునేందుకు విచిత్ర ప్రయోగం చేశాడు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘చలి తగలకుండా ఇలా ఎవరైనా చేస్తారా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు చలి (cold) నుంచి తప్పించుకునేందుకు విచిత్ర ప్రయోగం చేశాడు. ఇందుకోసం అతను ముందుగా ఇంట్లో పక్కన పడేసిన అట్ట పెట్టెను (cardboard box) తీసుకున్నాడు. దానికి ఓ వైపు భాగాన్ని మూసేసి, మరోవైపు భాగాన్ని తెరచి ఉంచాడు. తర్వాత బాక్స్ మధ్యలో రంధ్రం చేసి, అందులో ప్లాస్టిక్ బాటిల్‌ను ఏర్పాటు చేశాడు.
ఇలా ఆ అట్ట పెట్టెను సిద్ధం చేసుకుని, పడుకునే సమయంలో (man put the cardboard box on his head) దాన్ని తలకు తగిలించుకున్నాడు. తలపై హెల్మెట్ తరహాలో ఆ అట్ట బాక్స్‌ను పెట్టుకుని పడుకున్నాడు. తర్వాత శ్వాస ఆడేందుకు వీలుగా ప్లాస్టిక్ బాటిల్ మూతను తీసేశాడు. చివరగా మెడ వరకు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఇలా తలకు చలి తగలకుండా విచిత్ర ప్రయోగం చేసి అంతా అవాక్కయ్యేలా చేశాడన్నమాట.
Viral Video: బస్సులో కిటికీ బయట చేతులు పెడుతున్నారా.. ఇది చూస్తే చచ్చినా అలా చేయరు..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా పడుకున్నావ్ సరే.. మధ్యలో ఎవరైనా బాటిల్‌లో నీళ్లు పోస్తే ఏమవుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.60 లక్షలకు పైగా లైక్‌లు, 8.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: అడుగు వేసే ముందు ఆలోచించాల్సిందే.. ఈ పొలంలో సీన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
Viral Video: మేత పెట్టలేదని ఈ ఆవు చేసిన పని చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 20 , 2024 | 09:24 PM