ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రే.. ఏంట్రా.. ఇదీ.. బైకుతో ట్రైన్ లాగాలని చూశాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

ABN, Publish Date - Sep 12 , 2024 | 09:18 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వింత వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు మరీ విచిత్రకరమైన ప్రయోగాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొందరు బైకులను ఆటోలుగా మార్చితే.. మరికొందరు అదే బైకులకు బస్సు గేర్లను ఏర్పాటు చేయడం చూశాం. ఇంకొందరు..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వింత వింత ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు మరీ విచిత్రకరమైన ప్రయోగాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొందరు బైకులను ఆటోలుగా మార్చితే.. మరికొందరు అదే బైకులకు బస్సు గేర్లను ఏర్పాటు చేయడం చూశాం. ఇంకొందరు అదే సైలెన్సర్ సాయంతో బైకు టైరుకు గాలి పట్టడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా, ఓ యువకుడు చేసిన విచిత్ర ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యవకుడు బైకు వేసుకుని ఏకంగా రైలు పట్టాలపైకి వచ్చేశాడు. చివరకు ఆగి ఉన్న రైలింజన్ ఎదురుగా బైకును ఆపాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. బైకుతో అతను చేసిన విన్యాసం చూసి అంతా షాక్ అయ్యారు. బైకు వెనుక వైపు రోప్ కట్టి, దాన్ని రైలు ఇంజిన్‌కు కట్టేశాడు. తర్వాత బైకును స్టార్ట్ చేసి రైలింజన్‌ను లాగేందుకు ప్రయత్నించాడు.

Viral Video: ఆగిపోయిన కారును ఇలా ఎవరైనా తోస్తారా.. ఈ వ్యక్తి నిర్వాకానికి అవాక్కవుతున్న పనెటిజన్లు..


అయితే ఎంత ప్రయత్నించినా (young man tried to pull train with bike) రైలు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. ఎంత రైజ్ చేసినా టైరు గిర్రున తిరుగుంది కానీ రైలింజన్ మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో సదరు యువకుడు బైకును మరింత రైజ్ చేశాడు. ఇలా చేయడంతో చివరకు బైకు ముందు చక్రం గాల్లోకి లేచింది. అయినా ఆ యువకుడు బైకును మళ్లీ మళ్లీ రైజ్ చేస్తూనే ఉంటాడు. ఇలా రైలింజన్‌ను లాగాలని చాలా సేపు శ్రమించి చివరకు విఫలమయ్యాడు.

Viral Video: బైక్‌కూ పుట్టిన రోజు.. ఇతడు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బైకుతో రైలింజన్‌ను లాగడమేంట్రా బాబూ’’.. అంటూ కొందరు, ‘‘వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేయడం అలవాటైపోయింది’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 94 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వేదికపైకి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డ వధువు.. అసలు విషయం గ్రహించిన వరుడు.. చివరకు ఏం చేశాడంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 12 , 2024 | 09:18 PM

Advertising
Advertising