Viral Video: వామ్మో.. వీడికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు.. దొంగతనం చేస్తూనే ఎలా కవర్ చేసుకున్నాడో చూస్తే..

ABN, Publish Date - Jul 30 , 2024 | 12:30 PM

కొందరు దొంగల తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అందరి మధ్యలోనే ఉంటూ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చోరీలు చేసేస్తుంటారు. ఇంకొన్నిసార్లు అయితే పక్కనే ఉంటూ పర్సులు కొట్టేస్తుంటారు. ఇలాంటి..

Viral Video: వామ్మో.. వీడికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు.. దొంగతనం చేస్తూనే ఎలా కవర్ చేసుకున్నాడో చూస్తే..

కొందరు దొంగల తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అందరి మధ్యలోనే ఉంటూ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా చోరీలు చేసేస్తుంటారు. ఇంకొన్నిసార్లు అయితే పక్కనే ఉంటూ పర్సులు కొట్టేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలక సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ దొంగ బైకు చోరీకి వచ్చి.. దాన్ని కవర్ చేసుకునేందుకు ఎలా నడించాడో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా... ‘‘వీడికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు (young man) పట్టపగలు బైకును చోరీ (Bike theft) చేసేందుకు వచ్చాడు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చేతిలో క్రికెట్ బ్యాట్‌తో (Cricket bat) వచ్చాడు. బైక్ పక్కన నిల్చుని క్రికెట్ ఆడుతున్నట్లు బ్యాటును అటూ, ఇటూ ఊపుతున్నాడు. మధ్య మధ్యలో పక్కన ఉన్న బైకు హ్యాండిల్‌ను అటూ ఇటూ ఊపి దానికి లాక్ ఉందో లేదో చెక్ చేశాడు.

Viral Video: ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు.. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే..


అయితే హ్యాండిల్ లాక్ చేసి ఉందని తెలుసుకుని, మధ్య మధ్యలో బ్యాట్ ఊపుతూ చివరక బైకుపై కూర్చున్నాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న వారు.. ఇతనేదో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాడులే.. అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బైకుపై కూర్చున్న అతను డూప్లికేట్ తాళం చెవితో బైక్‌ను లాక్ ఓపెన్ చేయాలని చూశాడు. అయితే ఇంతలో ఎదురుగా ఉన్న వారు ఇతన్ని వీడియో తీయడం చూసి షాక్ అయ్యాడు. చివరగా బ్యాట్ ముఖానికి అడ్డు పెట్టుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు.

Viral Video: బార్డర్‌లో సైనికులకే కాదు.. జింకలకూ పోటాపోటీ.. కంచెకు రెండు వైపులా వాటి నిర్వాకం చూస్తే..


ఈ ఘటనను మొత్తం చూస్తుంటే వ్యూస్, లైక్‌ల కోసం కావాలని చేసినట్లుగా అనిపిస్తున్నా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వారెవ్వా.. వీడి నటనకి ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు’’.. అంటూ కొందరు, ‘‘ఇది మొత్తం స్క్రిప్టెడ్ వీడియో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: స్కూటీ నడపడమే కాదు.. ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియాలి.. ఈ అమ్మాయిలు ఏం చేశారో చూడండి..

Updated Date - Jul 30 , 2024 | 12:30 PM

Advertising
Advertising
<