Viral Video: ప్యాక్ చేసిన రసగుల్లాలను లొట్టలేసుకుని మరీ తింటున్నారా.. ఈ వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
ABN, Publish Date - Dec 06 , 2024 | 09:17 PM
ప్రస్తుతం బయట దొరికే ఆహార పదార్థాలను తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. వాటి తయారీ విషయంలో కొందరి నిర్లక్ష్యం.. ఇలాంటి భయాలకు కారణమవుతోంది. హోటళ్లలో వంట గదుల్లో శుభ్రత పాటించకపోవడం, వివిధ రకాల స్వీట్ల తయారీలో కొందరు కార్మికులు వ్యవహరించే తీరు చూస్తే ..
ప్రస్తుతం బయట దొరికే ఆహార పదార్థాలను తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. వాటి తయారీ విషయంలో కొందరి నిర్లక్ష్యం.. ఇలాంటి భయాలకు కారణమవుతోంది. హోటళ్లలో వంట గదుల్లో శుభ్రత పాటించకపోవడం, వివిధ రకాల స్వీట్ల తయారీలో కొందరు కార్మికులు వ్యవహరించే తీరు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రసగుల్లాలను డబ్బాల్లో ప్యాక్ చేస్తున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కర్మాగారంలో కొందరు కార్మికులు రసగుల్లాలను (rasgulla packing) డబ్బాల్లో ప్యాక్ చేస్తుంటారు. ఇందులో షాక్ అవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. వాళ్ల పని చేస్తున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ పెద్ద కంటైనర్‌లో ఉన్న రసగుల్లాలను ఓ యువకుడు పెద్ద గరిటతో తీసి మరో కంటైనర్‌లో వేస్తున్నాడు.
Viral Video: వామ్మో.. ఇదేంట్రా బాబోయ్.. నడి రోడ్డుపై కింగ్ కోబ్రాతో ఫన్నీ గేమ్స్..
అక్కడ ఉన్న యువకుతుల వాటిని చిన్న చిన్న గరిటెలతో తీసుకుని డబ్బాల్లో పోస్తున్నారు. ఇలా పోసిన తర్వాత అక్కడే ఉన్న మరో వ్యక్తి వాటని తీసుకుని మిషన్ సాయంతో ప్యాక్ చేసి పంపిస్తున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా.. ఈ పని చేస్తున్న వారిలో ఒక్క వ్యక్తి తప్ప మిగతా (Young men working without gloves) ఎవరూ చేతులకు గ్లౌజులను వేసుకోలేదు. అపరిశుభ్రమైన చేతులతో అక్కడ పడితే అక్కడ తాకుతూ డబ్బాల్లో్ రసగుల్లాలను నింపుతున్నారు.
Viral: ఇంత చిన్న దుకాణంపై అంత పెద్ద ఇల్లేంట్రా బాబోయ్.. ఈ ఇంజినీర్ తెలివి మామూలుగా లేదుగా..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రసగుల్లాలను తినాలంటేనే ఇకపై ఆలోచించాలేమో’’.. అంటూ కొందరు, ‘‘ప్యాక్ చేసిన స్వీట్లను తినడం మంచిది కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లు, 3.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: మీ తెలివి సల్లగుండ.. కష్టపడుతున్నారనుకుంటే.. ఇదా మీరు చేసేది..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 06 , 2024 | 09:17 PM