ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదేనేమో.. ప్లాట్‌ఫామ్‌పై ఈమె చేసిన పని చూడండి..

ABN, Publish Date - Aug 03 , 2024 | 08:07 AM

బహిరంగ ప్రదేశాల్లో యువతులు డాన్సులు వేయడం ప్రస్తుతం సర్వసాధాణమైపోయింది. ఏదోటి చేసి నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్ర పనులన్నీ చేస్తుంటారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రాంక్ వీడియోలు చేస్తూ కొందరు..

బహిరంగ ప్రదేశాల్లో యువతులు డాన్సులు వేయడం ప్రస్తుతం సర్వసాధాణమైపోయింది. ఏదోటి చేసి నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు చిత్రవిచిత్ర పనులన్నీ చేస్తుంటారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రాంక్ వీడియోలు చేస్తూ కొందరు, డాన్స్ వీడియోలు చేస్తూ ఇంకొందరు ప్రజలకు చిరాకు తెప్పిస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఓ యువతి చేసిన డాన్స్‌ చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ప్లాట్‌ఫామ్‌పై అందరితో పాటూ రైలు కోసం వేచి చూస్తుంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా కామ్‌గా ఉన్న ఆ యువతి ఆ వెంటనే డాన్స్ చేస్తూ పూనకంతో ఊగిపోయింది. పక్కనే ఉన్న మరో మహిళను (young woman dance on railway platform) వెనుక నుంచి ఢీకొడుతూ డాన్స్‌లు చేసింది.

Viral Video: గుండె ఆగిపోయే సీన్.. ప్రాణాలంటే లెక్కేలేదా..?


యువతి నిర్వాకంతో షాకైన ఆ మహిళ చివరకు ఆమెను జుట్టు పట్టుకుని మరీ కొట్టడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ఆ యువతి ఆమెను తన్నేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా చాలా సేపు ఆ యువతి ప్లాట్‌ఫామ్‌పై రచ్చరచ్చ చేసింది. యువతి ఉన్నట్టుండి చేసిన ఈ వింత నిర్వాకానికి చుట్టుపక్కల వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన చూస్తుంటే.. వ్యూస్, లైక్‌ల కోసం వాళ్లిద్దరూ కలిసి ఇలా చేసినట్లు తెలుస్తోంది.

Viral Video: మద్యం మత్తులో డ్రైవింగ్ సీటు దిగి మరీ.. ఇతడు చేసిన డేంజరస్ స్టంట్ చూస్తే..


కాగా, ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి పనులు... పబ్లిక్‌ను ఇబ్బంది పెట్టడమే’’.. అంటూ కొందరు, ‘‘తమాషాకూ ఓ హద్దు ఉంటుంది.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, ‘‘రైల్వే స్టేషన్లలో ఇలాంటి పిచ్చి పనులు చేయడం సర్వసాధారణమైపోయింది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. ఇంట్లోకి దూరిన చిరుత పులి.. అక్కడే ఉన్న కుక్కలు గమనించడంతో..

Updated Date - Aug 03 , 2024 | 08:07 AM

Advertising
Advertising
<