Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. రీల్స్ చేస్తూ బైకర్‌కు షాకిచ్చిన యువతి.. చివరకు..

ABN, Publish Date - Jul 17 , 2024 | 07:46 PM

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది యువతీయువకులు రీల్స్ పిచ్చిలో పడి తమను తాము మర్చిపోతున్నారు. మరికొందరు ఇదే రీల్స్ పేరుతో పిచ్చి చేష్టలు చేస్తూ ఎదుటివారికి ఇబ్బందిగా మారుతుంటారు. ఇలాంటి వీడియోలు...

Viral Video: పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుందేమో.. రీల్స్ చేస్తూ బైకర్‌కు షాకిచ్చిన యువతి.. చివరకు..

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది యువతీయువకులు రీల్స్ పిచ్చిలో పడి తమను తాము మర్చిపోతున్నారు. మరికొందరు ఇదే రీల్స్ పేరుతో పిచ్చి చేష్టలు చేస్తూ ఎదుటివారికి ఇబ్బందిగా మారుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రీల్స్ చేసే క్రమంలో రోడ్డుపై బైకర్‌కు షాక్ ఇచ్చింది. చివరకు ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి డాన్స్ (Young woman dance) చేస్తూ రీల్స్ (Reels) చేయాలని అనుకుంది. ఇందుకోసం చివరకు నడి రోడ్డుపై డాన్స్ చేసేందుకు సిద్ధమైంది. వాహనాలను చూసుకుని డాన్స్ చేయాల్సి పోయి.. అందుకు విరుద్ధంగా ఎవరొస్తే నాకేం.. నా డాన్స్ నాదే.. అన్నట్లుగా డాన్స్ చేస్తోంది. ఇంతలో వెనుక వైపు రెండు బైకులు వచ్చాయి.

Viral Video: పరీక్ష కేంద్రంలో స్వయంగా సమాధానాలు చెబుతున్న టీచర్లు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..


వారిలో ముందుగా వచ్చిన ఓ బైకర్.. ఆమెను చూసి స్లో చేశాడు. అయితే డాన్స్ చేసే క్రమంలో వెనక్కు వెళ్లి అతడి బైకును అడ్డుకోవడంతో (biker fell down) ఆ వ్యక్తి అదుపుతప్పి కిందపడ్డాడు. బైకర్ కిందపడడాన్ని చూసినా కూడా ఆ యువతి.. డాన్స్ వేయడం మాత్రం ఆపలేదు. ఎవరేమైతే నాకేం.. డాన్స్ వేయడమే నా ధ్యేయం.. అన్నట్లుగా అలాగే డాన్స్ చేస్తూనే ఉంది. ఈ యువతి చేష్టలకు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

Viral Video: మేడపై ఇలాంటి పనులు చేస్తుంటే జాగ్రత్త.. గుండె ధైర్యం ఉన్న వాళ్లు మాత్రమే చూడండి..


ఈ ఘటన చూస్తే.. వారంతా కలిసి వ్యూస్ కోసం కావాలనే ఇలా చేసినట్లు అనిపిస్తున్నా కూడా.. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రీల్స్ పిచ్చి పీక్స్‌లో ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు ఇలాగే తయారయ్యారు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చికెన్ షాపులో కోడి చివరి చూపులు.. తోటి కోడిని ముక్కలు చేయడాన్ని చూడగానే..

Updated Date - Jul 17 , 2024 | 07:46 PM

Advertising
Advertising
<