ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: రీల్స్ కోసం సిలిండర్‌పై యువతి డాన్స్.. చివరకు షాకింగ్ ట్విస్ట్ ఏంటో మీరే చూడండి..

ABN, Publish Date - May 30 , 2024 | 05:58 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువత రీల్స్ మాయలో పడిపోతున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం చిత్రవిచిత్ర ప్రయోగాలన్నీ చేసేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది యువత రీల్స్ మాయలో పడిపోతున్నారు. వ్యూస్, లైక్‌ల కోసం చిత్రవిచిత్ర ప్రయోగాలన్నీ చేసేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రీల్స్ కోసం ఓ యువతి సిలిండర్‌పై నిలబడి డాన్స్ చేస్తోంది. ఈ క్రమంలో చివరకు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఎలాగైనా అత్యధిక వ్యూస్, లైక్‌లను తెచ్చుకునేందుకు వినూత్నంగా డాన్స్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆమె చివరకు సిలిండర్‌ను ఎంచుకుంది. ఖాలీ సిలిండర్‌ను గోడ పక్కన నిలబెట్టి, దానిపై ఆమె నిలబడి డాన్స్ చేయడం మొదలెట్టింది. సిలిండర్‌పై బ్యాలెన్స్‌గా ( woman dance on gas cylinder) నిలబడి డాన్స్ చేసింది. అయితే ఈ క్రమంలో ఆమె మరింత వేగంగా డాన్స్ చేయడం మొదలెట్టింది.

Viral Video: చలనం లేకుండా పడి ఉన్న కోతిని.. ఈ పోలీసు క్షణాల్లో ఎలా రక్షించాడో చూడండి..


కాళ్లను అటూ ఇటూ వేగంగా కదుపుతూ డాన్స్ చేసే క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి.. ధబేల్‌మని కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆమెకూ ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సిలిండర్‌పై డాన్స్.. చివరకు బాగానే అయిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పనులు చేయడం చాలా ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొతం చేసుకుంది.

Viral Video: ఆకలితో ఉందని మహిళ ఆహారం తినిపిస్తే.. చివరకు ఈ నక్క చేసిన నిర్వాకం..

Updated Date - May 30 , 2024 | 05:58 PM

Advertising
Advertising