Viral video: తెలివా.. అతి తెలివా..! అద్దం ముందు ఈమె చేస్తున్న పని చూసి నెటిజన్లు షాక్..
ABN, Publish Date - Jun 14 , 2024 | 07:08 PM
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వినూత్నంగా ఆలోచించే వారు ఇట్టే వైరల్ అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తుంటారు. మరికొందరు అమాయకంగా ...
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వినూత్నంగా ఆలోచించే వారు ఇట్టే వైరల్ అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ వీడియోలు చేస్తుంటారు. మరికొందరు అమాయకంగా ఆలోచిస్తూ అందరికీ నవ్వు తెప్పిస్తుంటారు. తాజాగా, ఓ యువతి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అద్దం ముందు నిలబడి తన వెంట్రుకలను హీట్ చేసుకుంటున్న యవతిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమెది తెలివా.. లేక అతి తెలివా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) అద్దం ముందు నిలబడి తన వెంట్రుకలను స్ట్రెయిట్నర్తో (Hair straightener) హీట్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. మిషిన్కు ఆమె విద్యుత్ కనెక్షన్ (Electrical connection) ఇచ్చిన విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా స్ట్రెయిట్నర్కు కరెంట్ కనెక్షన్ ఇచ్చి హీట్ చేస్తారు.. ఈమె కూడా అలాగే చేసింది. కానీ ప్లగ్ బోర్డు పక్కనే ఉన్నా కూడా అక్కడి నుంచి వైరును చాలా దూరం వరకూ పొడిగించింది.
Viral video: నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది మరి.. ఈ యువకుడికి ఏమైందో చూడండి..
మధ్య మధ్యలో చాలా బోర్డులు ఏర్పాటు చేసుకుని, ఒకదానికొకటి కనెక్షన్ ఇచ్చుకుంటూ చివరకు ఆమె పక్కనే ఉన్న ప్లగ్‌లోనే కనెక్షన్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలా చేస్తే షాక్ మెల్లగా తగులుతుందేమో’’.., ‘‘ఇది కదా తెలివైన పని అంటే’’.., ‘‘ఈమె పోరాటం మామూలుగా లేదు’’.., ‘‘ఇండియాలో ఇలాంటి టాలెంట్‌కి కొదవే లేదు’’.., ‘‘ఈమె అనుభం ఉన్న ఇంజినీర్లా ఉందే’’.., అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 77వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral video: బెడ్ బాగుందని కునుకు తీస్తున్నారా.. జాగ్రత్త..! ఇలాంటి ప్రమాదం కూడా పొంచి ఉండొచ్చు..
Updated Date - Jun 14 , 2024 | 07:09 PM