ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రీల్ కోసం డ్యామ్‌లో ఈమె చేసిన నిర్వాకం చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Jul 04 , 2024 | 09:35 PM

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా మంది రీల్స్ పిచ్చిలో పడి ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో తమ ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. ఈ క్రమంలో...

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా మంది రీల్స్ పిచ్చిలో పడి ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో తమ ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కొన్నిసార్లు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయినా ఇలాంటి వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా, రీల్స్ కోసం ఓ యువతి చేసిన రిస్క్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో చివరకు ప్రమాదకర విన్యాసం చేసేందుకు సిద్ధమైంది. నీళ్ల ఉదృతంగా ప్రవహిస్తున్న డ్యామ్ వద్దకు వెళ్లిన ఆమె.. చివరకు వినూత్న విన్యాసం చేసింది. డ్యామ్ గోడపై నిలబడ్డ ఆమె.. నీటిపై బోర్లా పడుకుని డ్యామ్ కిందకు జారింది. ఇలా డ్యామ్ గోడపై ఏటవాలుగా (woman stunts at the dam) జారుకుంటూ చివరకు నీటిలోనే మునిగిపోయింది.

Viral Video: బస్సు డోరు వద్ద నిల్చున్న మహిళకు షాకింగ్ అనుభవం.. సీసీ ఫుటేజీ చూడగా..


తర్వాత చాలా సేపు నీటిలోనే ఉండిపోతుంది. ఎంత సేపటికీ నీటి పైకి రాదు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా.. తర్వాత ఏం జరిగిందో అనే ఆందోళనలో ఉన్నారు. ఇంతకీ ఆ యువతికి ఏమైందీ.. క్షేమంగానే ఉందా.. అంటూ చర్చించుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమెకేమైనా పిచ్చా.. ఇలాంటి విన్యాసాలు చేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇటుకలతో వాషింగ్‌మెషిన్.. ఈమె తెలివి మామూలుగా లేదుగా..

Updated Date - Jul 04 , 2024 | 09:35 PM

Advertising
Advertising