ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: స్కూటీపై వెళ్తూ యువకుల ముందు ఫోజ్ కొట్టిన యువతులు.. చివరకు..

ABN, Publish Date - Jun 01 , 2024 | 07:43 PM

ప్రస్తుతం ఎక్కువ శాతం మంది యువతీయువకులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ధ్యేయంతోనే ఉంటారు. ఏ పని చేస్తు్న్నా కూడా.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా కొందరు చూస్తుంటే.. మరికొందరు...

ప్రస్తుతం ఎక్కువ శాతం మంది యువతీయువకులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ధ్యేయంతోనే ఉంటారు. ఏ పని చేస్తు్న్నా కూడా.. అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా కొందరు చూస్తుంటే.. మరికొందరు ఏకంగా చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువతులు.. స్కూటీపై వెళ్తూ యువకుల ముందు ఫోజ్ కొట్టారు. చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు స్కూటీపై వేగంగా వెళ్తుంటారు. ఈ క్రమంలో వారితో పాటూ కొందరు బైకర్లు అత్యంత వేగంగా వెళ్తుంటారు. చివరకు యువతులను ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్లిపోతారు. ఈ క్రమంలో స్కూటీపై వెనుక కూర్చున్న యువతి.. పైకి లేచి నిలబడి, యువకుల ముందు ఫోజ్ కొడుతుంది. చాలా సేపు అలాగే నిలబడి యువకుల వైపు చూస్తూ చేయి ఊపుతూ ఉంటుంది. ఆమె చేసిన పనికి చివరకు స్కూటీ అదుపు తప్పుతుంది.

Viral Video: బైకుపై స్విమ్మింగ్ పూల్.. ఎండ వేడి తట్టుకునేలా ఇతను చేసుకున్న ఏర్పాట్లు చూడండి..


వాహనం రోడ్డు పక్కకు లాగడంతో బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో స్కూటీ నడుపుతున్న యువతి.. వాహనాన్ని కంట్రోల్ చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వాహనాన్ని మళ్లీ రోడ్డు పైకి మళ్లింది. అయినా అదుపు చేయలేక (women falldown on scooty) ధబేల్‌మని కిందపడిపోతారు. చాలా దూరం వరకు వాహనం వారిని లాక్కుని వెళ్తుంది. అయితే అదృష్టవశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారి వెనుకే వస్తున్న బైకర్లు.. యువతులు కింద పడడం చూసి వాహనం ఆపి వారికి సాయం చేస్తారు. ఈ ఘటనను మొత్తం బైకర్ల కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎవరూ లేని సమయంలో ఆఫీసులో యువతి నిర్వాకం.. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. అవాక్కయ్యే సీన్..

Updated Date - Jun 01 , 2024 | 07:43 PM

Advertising
Advertising