ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఆవేశంగా వచ్చిన ఎలిగేటర్.. ఉన్నట్టుండి తలపై చేయి పెట్టిన యువతి.. చివరకు..

ABN, Publish Date - Aug 15 , 2024 | 07:28 PM

ఎలిగేటర్లు, మొసళ్లు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి సమీపానికి కాదు కదా.. కనీసం దూరం నుంచి చూడటానికి కూడా జనం భయపడుతుంటారు. అయితే కొందరు మాత్రం మొసళ్లతో కూడా ఆడుకుంటూ కనిపిస్తుంటారు. ఇంకొందరైతే ..

ఎలిగేటర్లు, మొసళ్లు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి సమీపానికి కాదు కదా.. కనీసం దూరం నుంచి చూడటానికి కూడా జనం భయపడుతుంటారు. అయితే కొందరు మాత్రం మొసళ్లతో కూడా ఆడుకుంటూ కనిపిస్తుంటారు. ఇంకొందరైతే వాటితో స్నేహం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మొసళ్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్లే వారిని చూశాం, నీళ్లలోకి వెళ్లి మొసలికి ముద్దు పెట్టి మరీ మాంసం తినింపించిన వారినీ చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆవేశంగా సమీపానికి వచ్చిన ఎలిగేటర్‌పై ఓ యువతి ఉన్నట్టుండి చేయి వేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద ఎలిగేటర్ నీటిలోంచి ఒడ్డు మీకు వస్తుంది. ఒడ్డు మీద యువతి వద్దకు ఎంతో ఆవేశంగా వస్తుంది. తగ్గరికి వచ్చిన ఆమె తీరా దాడి చేసే సమయంలో సదరు యువతి (young woman) ఉన్నట్టుండి ఎలిగేటర్‌పై చేయి పెడుతుంది.

Viral Video: వామ్మో.. బతికుండగానే గోతిలో పూడ్చేశారు.. చివరకు ఏం జరిగిందో చూడండి..


దీంతో అప్పటిదాకా ఆవేశంగా ఉన్న ఎలిగేటర్.. ఆమె చేయి వేయడంతో (young woman put her hand on alligator head) ఒక్కసారిగా కూల్ అవుతుంది. యువతి చేయి వేయగానే అంత భయంకనమైన ఎలిగేటర్ కాస్తా.. పిల్లిలా సైలెంట్ అయిపోతుంది. ఈ ఘటనను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..


ఈ వీడియోపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘టీచర్ ముందు స్టూడెంట్‌లా మారిపోయింది’’.., ‘‘ఫ్లోరిడాలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం’’.., ‘‘ఈమె ధైర్యానికి హ్యాట్సాప్’’.., ‘‘ఇలాంటి పనులు చేయడం ప్రమాదకరం’’.., ‘‘క్రూరమైన జంతువును కూడా స్త్రీ మచ్చిక చేసుకోగలదు’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పాత్రలు కడుగుతున్న మహిళపై అనుమానం.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Aug 15 , 2024 | 07:28 PM

Advertising
Advertising
<