Viral video: అది బైక్ అనుకున్నావా.. లేక సైకిల్ అనుకున్నావా.. ఈ యువతి డ్రైవింగ్ చూస్తే..
ABN, Publish Date - Jun 29 , 2024 | 08:50 PM
సినిమాల్లో కనిపించే యాక్షన్, కామెడీ సన్నివేశాల తరహాలో కొన్నిసార్లు నిజ జీవితంలోనూ జరుగుతుంటుంది. కొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. బైక్‌పై..
సినిమాల్లో కనిపించే యాక్షన్, కామెడీ సన్నివేశాల తరహాలో కొన్నిసార్లు నిజ జీవితంలోనూ జరుగుతుంటుంది. కొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నే ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. బైక్‌పై విన్యాసాలు చేసే వాళ్లను చాలా మందిని చూసుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి బైక్‌ను వినూత్నంగా నడిపి అందరినీ తెగ నవ్విస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఏవమ్మా.. అది బైక్ అనుకున్నావా.. లేక సైకిల్ అనుకున్నావా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి (young woman) బైకుపై రయ్యిన దూసుకుపోతుంటుంది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఈమె బైకు నడిపిన విధానం (Bike driving) చూసి అంతా షాక్ అవుతున్నారు. సాధారణంగా చిన్న పిల్లలు సైకిల్ నేర్చుకునే సమయంలో ఎక్కే క్రమంలో, దిగే క్రమంలో ఎలా చేస్తారో ఈ యువతి అచ్చం అలాగే చేసింది. బైకుపై వెళ్తుండగా.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగాల్సి వచ్చింది. అయితే ఆమె బైకుపై కూర్చుంటే కాళ్లు నేలపై మోపలేని పరిస్థితి. దీంతో వెళ్తూ వెళ్తూనే ఓ వైపునకు మళ్లుకుని బైకును ఆపి, మెల్లగా నేలపై అడుగుపెడుతుంది.
అలాగే బైకు పైకి ఎక్కే క్రమంలోనూ సైకిల్ తరహాలో వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా కాలును అవతలి వైపునకు వేస్తుంది. ఇలా చిన్న పిల్లలు సైకిల్ (cycle) తొక్కినట్లుగా.. ఈమె బైకును నడిపి అందరినీ నవ్వించింది. ఆమె వెనుక వాహనంలో వెళ్తున్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషలో మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి డ్రైవింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘స్లిప్ అయితే నేరుగా నేరుగా ఆస్పత్రికే’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ప్రమాదరకం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral video: తారక్ చెప్పినట్లే జరిగింది.. చిరుత పులి సమీపానికి వెళ్లి ఫొటో తీయగా.. చివరకు..
Updated Date - Jun 29 , 2024 | 08:50 PM