ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బైకు నడుపుతున్న యువతి.. సడన్‌గా టైరులో ఇరుక్కున్న చున్నీ.. చివరకు..

ABN, Publish Date - Aug 27 , 2024 | 09:23 PM

బైకు డ్రైవింగ్ సమయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఊహించని ప్రమాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొందరు చీర కొంగు టైరు మధ్యలో ఇరుక్కుని ..

బైకు డ్రైవింగ్ సమయాల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఊహించని ప్రమాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కొందరు చీర కొంగు టైరు మధ్యలో ఇరుక్కుని మహిళలు కిందపడిన ఘటనలు చాలా చూశాం. ఇలాంటి వీడియోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. బైకులో వెళ్తుండగా.. ఉన్నట్టుండీ తన చున్నీ టైరు మధ్యలో ఇరుక్కుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన స్నేహితురాలిని బైకులో ఎక్కించుకుని వెళ్తుంటుంది. అయితే మార్గ మధ్యలో ఉన్నట్టుండి తన మెడలోని చున్నీ ఓ వైపు కిందకు వెళ్లి చివరకు (woman scarf get trapped in bike tire) టైరులో ఇరుక్కుంటుంది. దీంతో చూస్తుండగానే ఆమె పూర్తిగా ముందుకు వంగిపోతుంది. చున్నీ టైట్ అయ్యే కొద్దీ ఆమె తల హ్యాండిల్ మధ్యలో ఇరుక్కుంటుంది.

Viral Video: మహిళ పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. చివరికి చిన్న టెక్నిక్‌తో..


అయినా ఆమె ఎంతో చాకచక్యంగా బైకును కంట్రోల్ చేస్తుంది. మెల్లిగా బ్రేకు బేకులు వేసి ఎలాగోలా కిందపడకుండా బైకును ఆపేస్తుంది. దీంతో వెనుక కూర్చున్న యువతి కంగారుగా కిందకు దిగి.. ఆమెకు ఏమైందా అని చూస్తుంది. ఇంతలో అక్కడే ఉన్న వారంతా వారి వద్దకు వచ్చి సాయం చేస్తారు. చివరకు ఆమె మెడలోని చున్నీని పక్కకు తీస్తారు. టైరులో ఇరుక్కున్న చున్నీని తీసేయడంతో ప్రమాదం తప్పుతుంది.

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..


ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. అప్రమత్తంగా లేకపోతే ఎంత ఘోరం జరిగేది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ వధూవరుల క్రియేటివిటీ మామూలుగా లేదుగా.. భార్యను తన ఇంటికి ఎలా తీసుకెళ్తున్నాడో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 27 , 2024 | 09:23 PM

Advertising
Advertising
<