Viral video: ఈ యువతి తెలివి మామూలుగా లేదుగా.. హోటల్లో ప్రియుడికి లిప్‌స్టిక్‌తో ఎలా షాక్ ఇచ్చిందో చూడండి..
ABN, Publish Date - Jun 13 , 2024 | 09:33 PM
సోషల్ మీడియాలో ప్రేమికులకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రియురాలికి ప్రియుడు, ప్రియుడికి ప్రియురాలు అనేక రకాల సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. ఇంకొన్నిసార్లు యువుతులు...
సోషల్ మీడియాలో ప్రేమికులకు సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రియురాలికి ప్రియుడు, ప్రియుడికి ప్రియురాలు అనేక రకాల సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటారు. ఇంకొన్నిసార్లు యువుతులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ తమ ప్రియుళ్లకు ఝలక్ ఇస్తుంటారు. ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి హోటల్లో తన ప్రియుడికి లిప్‌స్టిక్‌తో షాక్ ఇచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట (lovers) హోటల్లో భోజనం చేస్తుంటుంది. ఈ సమయంలో తమాషా సంఘటన చోటు చేసుకుంటుంది. భోజనానంతరం సప్లయర్ బిల్లు తీసుకుని వారి టేబుల్‌పై పెడతాడు. బిల్లు చేతికి తీసుకుని చూసిన యువతి చెల్లించేందుకు సిద్ధమవుతుంది. పక్కనే ఉన్న తన హ్యాండ్ బ్యాగ్‌ను చేతిలోకి తీసుకుంటుంది. బిల్లు తన ప్రియురాలే కడుతుందని ప్రియుడు (boyfriend) తాపీగా కూర్చుని ఉంటాడు.
Viral video: కారు ఢీకొనడంతో ఎగిరి దూరంగా పడ్డ యువతి.. చివరకు ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
హ్యాండ్ బ్యాగ్ టేబుల్‌పై పెట్టిన యువతి.. అందులో నుంచి లిప్‌స్టిక్ (Lipstick) బయటికి తీసుకుని తన పెదాలకు రాసుకుంటుంది. ‘‘బిల్లు కట్టాల్సింది నేను కాదు.. నువ్వే’’.. అని ఆమె చెప్పకనే చెప్పింది. ఆమె చేసిన పనికి అవాక్కైన ప్రియుడు నవ్వుకుంటూ తన డెబిట్ కార్డును సప్లయర్‌కు ఇచ్చి బిల్లు చెల్లిస్తాడు. అతను నవ్వుతున్నా కూడా ఆమె మాత్రం ఒకే ఎక్స్‌ప్రెషన్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి భలె షాక్ ఇచ్చిందే’’.. అంటూ కొందరు, ‘‘పురుషులకు ఇలాంటి శిక్ష తప్పదు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Women: యువతి పిలవడంతో స్నేహితులతో కలిసి వెళ్లిన యువకుడు.. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత..
Updated Date - Jun 13 , 2024 | 09:33 PM