Viral Video: తల్లిదండ్రులు, పోలీసుల ఎదుటే ప్రియుడిని కౌగిలించుకున్న యువతి.. చివరకు..
ABN, Publish Date - Mar 05 , 2024 | 06:28 PM
ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్ర మలుపులు తీసుకుంటుంటాయి. తల్లిందండ్రులను మాటకు కట్టుబడి ఇష్టం లేని పెళ్లి చేసుకునే వాళ్లు కొందరైతే.. మరికొందరు తీరా వివాహ సమయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్ర మలుపులు తీసుకుంటుంటాయి. తల్లిందండ్రులను మాటకు కట్టుబడి ఇష్టం లేని పెళ్లి చేసుకునే వాళ్లు కొందరైతే.. మరికొందరు తీరా వివాహ సమయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రేమజంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి తన తల్లిండ్రులు, పోలీసుల ఎదుటే ప్రియుడిని కౌగిలించుకుంది. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బీహార్ (Bihar) జముయ్ జిల్లాలోని బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధి టెటారియా గ్రామానికి చెందిన శ్రవణ్ సాహ్ కుమార్తె 20 ఏళ్ల వర్ష కుమారికి.. ముంగేర్ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. మార్చి 11న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి సమయం దగ్గరపడుతుండడంతో రెండు కుంటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయ్యాయి. ఈ సమంయలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ధునియామన్రాన్ గ్రామానికి చెందిన ఉమేష్ యాదవ్ అనే యువకుడికి, వర్షకు ఐదేళ్లుగా ప్రేమాయణం నడుస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే ఉమేష్ నిరుద్యోగి కావడంతో వర్ష తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వారు తమ కూతురికి ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు.
Viral: ఈ గొరిల్లాల యాక్టింగ్ మామూలుగా లేదుగా.. సెల్ఫీ తీసుకుంటుండగా..
ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వర్ష.. వివాహానికి వారం రోజుల ముందు ఇంటి నుంచి వెళ్లిపోయింది. నేరుగా ప్రియుడి వద్దకు వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి గుడిలో వివాహం చేసుకున్నారు. తర్వాత వర్ష ప్రియుడితో పాటూ అతడి ఇంట్లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వర్ష తల్లిదండ్రులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఉమేష్ గ్రామానికి వెళ్లారు. వర్షను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. వెళ్లేందుకు ఆమె అంగీకరించలేదు. పోలీసుల ఎదుటే ఇద్దరూ కౌగిలించుకుని.. ‘‘చావనైనా చస్తాం కానీ.. విడిపోయి మాత్రం ఉండలేం’’.. అంటూ తేల్చిచెప్పారు. తర్వాత ఎలాగోలా ఇద్దరినీ స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించారు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో చివరకు ఇంటికి పంపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: దీపావళి రాకెట్‌పై దూసుకెళ్లిన ప్రేమికులు.. వీళ్ల తెలివితేటలు మామూలుగా లేవుగా..
Updated Date - Mar 05 , 2024 | 06:28 PM